కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్‌?

తాజా వార్తలు

Published : 04/01/2021 01:16 IST

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన కోహ్లీ, హార్దిక్‌?

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్‌ సారథి విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గత డిసెంబర్‌ 7న కోహ్లీ, హార్దిక్‌ సిడ్నీలోని బేబీ షాప్‌లో ముఖానికి మాస్కులు ధరించకుండా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలను ఆ హోటల్‌ యాజమాన్యమే పోస్టు చేయడం విశేషం.

‘‘ఇవాళ మా స్టోర్‌కు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీషాప్‌ పోస్టు చేసింది. తాజాగా ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.  రోహిత్‌ శర్మ సహా ఐదుగురు ఆటగాళ్లు కూడా కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ శనివారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా అంశం చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి

గంగూలీ ఆరోగ్యంపై మరో బులిటెన్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని