స్కాట్లాండ్‌ అందాలు చూపిస్తున్న షమి

తాజా వార్తలు

Published : 13/07/2021 01:13 IST

స్కాట్లాండ్‌ అందాలు చూపిస్తున్న షమి

(Photo: Mohammed Shami Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్ షమి స్కాట్లాండ్‌లో విహరిస్తున్నాడు. అక్కడి వీధుల్లో సంచరిస్తున్న వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అక్కడ అందమైన భవనాలతో పాటు ఎంతో పరిశుభ్రంగా ఉన్న వీధులను అభిమానులకు చూపిస్తూ సంబరపడ్డాడు.

న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత భారత ఆటగాళ్లకు నెల రోజులకు పైగా ఖాళీ సమయం దొరకడంతో జట్టు యాజమాన్యం విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ దేశంలో ఎక్కడైనా విహరించడానికి సుమారు 20 రోజులు అనుమతులిచ్చింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా తమ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. అలా షమి కూడా స్కాట్లాండ్‌లో సంచరిస్తున్నాడు. ఆ వీడియోలనే ఇప్పుడు అభిమానులతో పంచుకున్నాడు.

మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ, రోహిత్‌, అజింక్య రహానె దంపతులు లండన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేద తీరుతుండగా అశ్విన్‌ ఇదివరకే తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌లోని పలు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లొచ్చాడు. ఇక యువ క్రికెటర్లు కొందరు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, వింబుల్డన్‌ మ్యాచ్‌లను తిలకించారు. అయితే, వీరికిచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుంది. దాంతో ఆటగాళ్లంతా ఆ రోజు లండన్‌లో కలుసుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి వారు బయో బుడగలోకి ప్రవేశిస్తారు. ఆపై కౌంటీ XI జట్టుతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు, తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని