Kohli చిన్నప్పటి మిత్రుడిలా ఉంటాడు: షమి
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kohli చిన్నప్పటి మిత్రుడిలా ఉంటాడు: షమి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చాలా సరదాగా ఉంటాడని, అందరితోనూ కలిసిమెలిసి మెలుగుతాడని పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఈ పేస్‌ బౌలర్‌‌.. తన సారథి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ జట్టులోని ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా ఉంటాడన్నాడు. అలాగే టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌ ఇంత బలంగా మారడానికి అతడి సారథ్యం కూడా ఓ కారణమని చెప్పాడు.

విరాట్‌ మా పేస్‌ బౌలింగ్‌ దళానికి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచాడు. మాకెంతో స్వేచ్ఛనిచ్చాడు. మా ప్రణాళికలు విఫలమైనప్పుడు మాత్రమే అతడు కోపగించుకుంటాడు. లేకపోతే మేం ఏం చేసినా ఏమనడు. ఎప్పుడూ నాపై కానీ, మా బౌలింగ్‌ యూనిట్‌పై కానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాడు. సహజంగా ఏ బౌలరైనా బంతులేసే ముందు కెప్టెన్‌తో మాట్లాడటానికి సందేహంగా ఉంటాడు. కానీ విరాట్‌ విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. మాతో కలిసి జోకులు వేస్తాడు. ప్రతి ఒక్కరితో సరాదాగా ఉంటాడు. అందరితో చిన్నప్పటి మిత్రుడిలా కలిసిపోతాడు’ అని షమి వివరించాడు. మరోవైపు గతకొన్నేళ్లుగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళం బలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల్లోనూ విజయాలు సాధిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని