Rishabh Pant is Back: బయో బుడగలోకి వచ్చేసిన రిషభ్‌ పంత్‌

తాజా వార్తలు

Published : 23/07/2021 01:21 IST

Rishabh Pant is Back: బయో బుడగలోకి వచ్చేసిన రిషభ్‌ పంత్‌

డుర్హమ్‌: టీమ్‌ఇండియాకు శుభవార్త! యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. రెండు టెస్టుల్లోనూ నెగెటివ్‌ రావడంతో డుర్హమ్‌లో బయో బుడగలోకి  మళ్లీ అడుగుపెట్టాడు. త్వరలో జరిగే అంతర్గత మ్యాచుల్లో ఆడనున్నాడు!

రిషభ్ పంత్‌ జట్టుతో కలవడంతో బీసీసీఐ ఆనందం వ్యక్తం చేసింది. ‘హలో రిషభ్ పంత్‌! నువ్వు పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది’ అని ట్వీట్‌ చేసింది. అభిమానులతో అతడి చిత్రం పంచుకుంది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత టీమ్‌ఇండియాకు మూడు వారాల విరామం లభించిన సంగతి తెలిసిందే. అప్పుడే రిషభ్ పంత్‌కు కరోనా సోకింది. దాంతో లండన్‌లోనే పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచారు. జట్టు వైద్య బృందం అతడిని పర్యవేక్షించింది. అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, బౌలింగ్‌కోచ్‌ భరత్‌ అరుణ్‌ను ఐసోలేషన్‌కు పంపించారు. పది రోజుల తర్వాత చేసిన రెండు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో పంత్‌ తిరిగి జట్టులో చేరాడు.

మరోవైపు యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తిరిగి స్వదేశానికి చేరుకున్నట్లు తెలిసింది. ఇంగ్లాండ్‌ నుంచి తిరిగొచ్చిన అతడి కోసం కుటుంబ సభ్యులు కేక్‌ కోసినట్టు తెలిసింది. ఆ చిత్రాన్ని గిల్‌ తన ఇన్‌స్టాలో పెట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత అతడు గాయపడ్డాడు. కీలక ఇంగ్లాండ్‌ సిరీసులో ఆడే అవకాశం కోల్పోయాడు. ఇక గాయపడ్డ నెట్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ త్వరలో స్వదేశానికి బయల్దేరనున్నట్లు తెలిసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని