Rahul Dravid: శాస్త్రి తర్వాత ద్రవిడే కోచ్‌!

తాజా వార్తలు

Published : 02/07/2021 15:28 IST

Rahul Dravid: శాస్త్రి తర్వాత ద్రవిడే కోచ్‌!

మాజీ క్రికెటర్‌ రీతిందర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవిశాస్త్రి తర్వాత టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అవుతారని మాజీ క్రికెటర్‌ రీతిందర్‌ సోధి అన్నారు. శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు అతడు కోచ్‌గా వెళ్లడమే ఇందుకు సూచన అని పేర్కొన్నారు. శాస్త్రి వారసత్వాన్ని కొనసాగించగలిగే స్థాయి అతడికే ఉందని ప్రశంసించారు.

‘కోచ్‌గా రవిశాస్త్రి సాధించిన ఘనతలను ముందు మనం గుర్తించాలి. అతడి ఒప్పందం ముగింపునకు వస్తోంది. కానీ మీరో విషయం ఆలోచించండి. తాత్కాలిక బాధ్యతల్లో రాహుల్‌ ద్రవిడ్‌ను పంపించారంటే ఏమనిపిస్తోంది? అతడు శ్రీలంకకు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా వెళ్లాడంటేనే ముందు వరుసలో ఉన్నాడని అర్థమవుతోంది. శాస్త్రి స్థానాన్ని భర్తీ చేయగల వారు ఉన్నారంటే అది ద్రవిడే’ అని రితీందర్‌ అన్నారు.

అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ అద్భుతమైన ప్రగతి సాధించారని రితీందర్‌ తెలిపారు. ‘ఇకపై కేవలం ఎన్‌సీయే అధినేతగానే ఉంటావా? అని అతడిని కచ్చితంగా అడిగే ఉంటారు. దానికి అతడు లేదనే సమాధానం ఇచ్చి ఉంటాడు. అతడు కుటుంబానికి విలువిస్తాడు. కావాలంటే బెంగళూరులోనే ఉండొచ్చు. కానీ అతడు బాధ్యతలను స్వీకరించాడు. జట్టు బాగా ఆడాలనే అతడు వెళ్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అతడు కోచ్‌ పదవికి ముందు వరుసలో ఉన్నాడు. ఒక దిగ్గజ క్రీడాకారుడు తాత్కాలిక బాధ్యతలకు మాత్రమే పరిమితం కావొద్దు’ అని రితీందర్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని