Tokyo olympics: టేబుల్‌ టెన్నిస్‌ రౌండ్‌-2లో భారత్‌ విజయం

తాజా వార్తలు

Updated : 25/07/2021 14:41 IST

Tokyo olympics: టేబుల్‌ టెన్నిస్‌ రౌండ్‌-2లో భారత్‌ విజయం

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా జరుగుతున్న టేబుల్‌ టెన్నిస్‌ వుమెన్స్‌ సింగిల్స్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. రెండో రౌండ్‌లో ఉక్రెయిన్‌ అథ్లెట్‌ పెసోట్స్కా మార్గారిటాపై భారత అథ్లెట్‌ మణికా బథ్రా 4-3 తేడాతో గెలుపొందింది. 7 గేమ్స్‌లకు గానూ నాలుగు గేమ్స్‌లో ప్రత్యర్థిపై మణిక పైచేయి సాధించింది. దీంతో ఆమె ప్రీక్వార్టర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సోఫియా పోల్కనోవాతో మణిక తలపడనుంది. నిన్న జరిగిన తొలిరౌండ్‌లో మణిక బ్రిటన్‌పై 4-0తో గెలుపొందింది.

చివరి వరకు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి రెండు గేమ్స్‌లో మణిక ఎక్కువ పాయింట్లు రాబట్టుకొని విజయం సాధించింది. తొలి రెండు గేమ్స్‌లో మార్గారిటా 11-4, 11-4తో లీడ్‌లో కొనసాగింది. ఆ తర్వాత మూడో, నాలుగో గేమ్‌లో 11-7, 12-10 పాయింట్లతో మణిక ముందుంజలోకి వచ్చింది. ఐదో గేమ్‌లో మార్గారిటా 11-8 పాయింట్లు, ఆరో గేమ్‌లో మణిక 11-5 పాయింట్లు సాధించి సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించే ఏడో గేమ్‌లో మణిక 11-7 పాయింట్లతో ప్రత్యర్థిని ఓడించింది. మొత్తంగా 4-3 పాయింట్ల తేడాతో గెలుపు మణిక సొంతమైంది.   


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని