INDvsSL: లంకకు పయనమైన టీమ్‌ఇండియా

తాజా వార్తలు

Updated : 28/06/2021 18:17 IST

INDvsSL: లంకకు పయనమైన టీమ్‌ఇండియా


(Photo: Shikhar Dhawan Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: శిఖర్‌ధావన్‌ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్‌ఇండియా సోమవారం శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా పయనమయ్యారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత రెండు వారాలుగా ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్న వారు నేటితో గడువు పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు మరికొంతమంది తొలిసారి భారత జట్టుకు ఎంపికైనవారు కూడా ఉన్నారు. వారిలో రుతురాజ్‌ గైక్వాడ్, దేవ్‌దత్‌ పడిక్కల్‌, కృష్ణప్ప గౌతమ్‌, చేతన్‌ సకారియా అవకాశం వస్తే సత్తా చాటాలని చూస్తున్నారు. మరోవైపు పృథ్వీషా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి ఆటగాళ్లు లంక పర్యటనలో రాణించి ఇంతకుముందులా తమ స్థానాలను పదిలపర్చుకోవాలని ఆశిస్తున్నారు.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీషా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని, చేతన్‌ సకారియా




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని