
తాజా వార్తలు
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
1996 తర్వాత విదేశాల్లో ఇదే తొలిసారి
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడ్డారు. అడిలైడ్‌లో తొలి టెస్టు ప్రారంభం కాకముందే ఇషాంత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా గాయాలబారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 20 మంది ఆటగాళ్లని ఆడించింది. 1961-62 సీజన్ తర్వాత టీమ్ఇండియా ఇంతమందితో ఒక సిరీస్‌లో ఆడటం ఇదే తొలిసారి.
ఇంతకు ముందు 17 మందితో..
ఇంతకు ముందు భారత్ 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో, 2018 ఇంగ్లాండ్ పర్యటనలో, 1959 ఇంగ్లాండ్ పర్యటనలో అత్యధికంగా 17 మందిని ఆడించింది. మరోవైపు ప్రస్తుత సిరీస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో విహారి, జడేజా గాయపడటం.. అశ్విన్, బుమ్రా నాలుగో టెస్టుకు దూరమవ్వడంతో కొత్తగా శార్దుల్ ఠాకుర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో మొత్తం ఆరు మంది యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. తొలి మూడు టెస్టుల్లో శుభ్‌మన్‌గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్‌సైని ఆడిన సంగతి తెలిసిందే.
1996లోనూ ఆరుగురు అరంగేట్రం..
ఇక 1996 ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా టీమ్ఇండియా ఆరుగురిని అరంగేట్రం చేయించింది. అందులో సునీల్ జోషి, పహరాస్ మాంబ్రే, వెంకటేశ్ ప్రసాద్, విక్రమ్ రాథోర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ ఉన్నారు. వీరిలో ప్రసాద్, ద్రవిడ్, గంగూలీ ఆకట్టుకున్నారు. తర్వాత గంగూలీ, ద్రవిడ్ సుదీర్ఘకాలం భారత జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించడమే కాకుండా కెప్టెన్లుగానూ రాణించారు.
ఇవీ చదవండి..
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
బుమ్రా ఊపిరి పీల్చుకునే సమయమివ్వాలి