దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌

తాజా వార్తలు

Updated : 11/01/2021 16:48 IST

దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కుడోస్ టీమిండియా! మూడో టెస్టులో విజేతలు మీరే. అదేంటి ఆస్ట్రేలియా×భారత్ మ్యాచ్ డ్రాగా ముగిసింది కదా! టీమిండియా విజేత ఎలా అవుతుంది అనుకుంటున్నారా? ఆఖరి రోజు భారత్‌ పోరాడిన తీరు చూస్తే సిడ్నీ టెస్టులో రహానెసేనదే నైతిక విజయమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అంత గొప్పగా పోరాడింది టీమిండియా. సగటు భారత అభిమాని గర్వించదగ్గ పోరాటమిది.

పంత్‌ సాహసోపేత ఇన్నింగ్స్‌, విహారి-అశ్విన్ బ్లాక్‌థాన్‌ వ్యూహం, పుజారా బలమైన డిఫెన్స్‌, వేలు విరిగినా బరిలోకి దిగడానికి సిద్ధమైన జడేజా తెగువ.. ఇలా సిడ్నీ టెస్టులో టీమిండియా చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. అందుకే దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు భారత ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మూడో టెస్టుపై ఎవరెవరు ఏమన్నారంటే..

‘‘జట్టులో పుజారా,‌ పంత్, అశ్విన్ ఎంత కీలకమో ఇప్పటికైనా అర్థమైందని ఆశిస్తున్నా. నాణ్యమైన బౌలర్లకు వ్యతిరేకంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు. అలాగే దాదాపు 400 వికెట్లు పడగొట్టడం ఆషామాషీ కాదు. గొప్పగా పోరాడారు. ఇక సిరీస్‌ గెలవాల్సిన సమయం ఆసన్నమైంది’’

- సౌరవ్‌ గంగూలీ

‘‘టీమిండియాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. రిషభ్‌ పంత్‌, చెతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌, హనుమ విహారి ప్రధాన పాత్ర పోషించారు. గొప్పగా ఆడారు. ఏ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ అత్యుత్తమం?’’

- సచిన్‌ తెందుల్కర్‌

‘‘దెబ్బ అదుర్స్‌ కదూ (పంత్ క్రీజులో ఉన్నంత వరకు). సాహసాలు కచ్చితంగా లేవు (పుజారా, విహారి, అశ్విన్‌ బ్యాటింగ్‌). ఈ రెండు వ్యూహాలతో ఇదో గొప్ప టెస్టుమ్యాచ్‌గా నిలిచింది. భారత జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. తనని ఎందుకు ప్రత్యేకంగా పరిగణించాలో పంత్ అందరికీ చాటిచెప్పాడు. ఇక విహారి, పుజారా, అశ్విన్‌ చూపించిన పట్టుదలను చూస్తే నమ్మశక్యంగా లేదు’’

- వీరేంద్ర సెహ్వాగ్‌

‘‘టెస్టు క్రికెట్ ఆసక్తిగా ఉండదని ఎవరన్నారు? టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలు, కీలక ఆటగాళ్లు దూరమవ్వడం, ఇతర ప్రతికూలతల్లో మరోసారి గొప్ప ప్రదర్శన చేసింది. పంత్‌ శతకం సాధించకపోయినా గర్వించదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడైన ఆటతో జట్టును పోటీలోకి తీసుకువచ్చాడు’’

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘‘టెస్టు క్రికెట్‌లో మరో గొప్ప మ్యాచ్‌. అడిలైడ్‌ ఘోర ఓటమి అనంతరం మెల్‌బోర్న్‌లో ఘన విజయం సాధించడం, ఇప్పుడు అద్భుత ప్రదర్శనతో సిడ్నీ టెస్టును డ్రా చేయడం ఎంతో ఆకట్టుకుంది. తొడకండరాలు పట్టేసిన విహారి ప్రతికూలతల్లో గొప్ప ప్రదర్శన చేశాడు. విజయలక్ష్మి గారు.. మీ అబ్బాయి (విహారి) చాలా బాగా ఆడుతున్నాడు’’

- హర్షా భోగ్లే

‘‘భారత్‌×ఆసీస్‌ టెస్టు సిరీస్‌ గొప్పగా సాగుతోంది. ఈ రోజు జరిగిన ఆట సూపర్‌. భారత్‌ ప్రదర్శన అద్భుతం. సిడ్నీలో ఇరు జట్లు గొప్ప పోరాట పటిమ చూపించాయి’’

- షేన్‌ వార్న్‌

‘‘టెస్టు క్రికెట్ అత్యుత్తమం. టీమిండియా తమ వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని చాటిచెప్పింది. స్ఫూర్తిదాయక పోరాటమిది’’

- కేఎల్ రాహుల్‌

ఇదీ చదవండి

విహారి-అశ్విన్‌ కాపాడారు

షోయబ్‌ మాలిక్‌కు తప్పిన ప్రమాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని