India vs Srilanka: ఆఖరి టీ20లో గబ్బర్‌, సంజు ఆడితే..!

తాజా వార్తలు

Published : 29/07/2021 17:13 IST

India vs Srilanka: ఆఖరి టీ20లో గబ్బర్‌, సంజు ఆడితే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌కు మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అండగా నిలిచాడు. మూడో టీ20లో వీరిద్దరూ పరుగులు చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచులో వీరిద్దరే కీలకం అవుతారని, రుతురాజ్‌, పడిక్కల్‌ చేసే పరుగులు బోనస్‌ అవుతాయని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ఎలా ముగించాలో ఇంకా తెలియదని వెల్లడించాడు.

రెండో టీ20లో టీమ్‌ఇండియా తక్కువ పరుగులే చేసిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లు ఆడిన గబ్బర్‌సేన 132/5 పరుగులే చేసింది. ధావన్‌ (40), రుతురాజ్‌ (21), దేవదత్‌ (29) మినహా మరెవ్వరూ భారీ పరుగులు చేయలేదు. ఇక లంక సైతం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తడబడింది. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని పరీక్షించారు. ఆఖరి ఓవర్లో గానీ ఆ జట్టుకు విజయం లభించలేదు.

‘ఆఖరి టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌కు శిఖర్‌ ధావన్‌, సంజు శాంసన్‌ మూల స్తంభాలు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ రాణా చేసే పరుగులు బోనస్‌. ధావన్‌, సంజు మెరుగైన స్కోర్‌ చేశారంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆఖరి గీత ఎలా దాటాలో ఈ శ్రీలంక జట్టుకు తెలియదు. రెండో టీ20లోనూ వారు ఇబ్బంది పడ్డారు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని