దీపక్‌ ఆర్డర్‌ నిర్ణయం ద్రవిడ్‌దే: భువీ

తాజా వార్తలు

Updated : 21/07/2021 14:04 IST

దీపక్‌ ఆర్డర్‌ నిర్ణయం ద్రవిడ్‌దే: భువీ

కొలంబో: దీపక్‌ చాహర్‌ను ముందు పంపించాలన్న నిర్ణయం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దేనని టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అతడా స్థానానికి న్యాయం చేశాడని ప్రశంసించాడు. మ్యాచ్‌ కఠినంగా సాగడంతో ఒక్కో బంతి ఆడుతూ ముందుకు సాగామని వివరించాడు.

లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో దీపక్‌ చాహర్‌ (69*; 82 బంతుల్లో 7×4, 1×6) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. భువీ (19*; 28 బంతుల్లో 2×4)తో కలిసి జట్టుకు విజయం అందించాడు. సాధారణంగా భువీ ముందుగా వస్తాడు. ఈ సారి దీపక్‌ రావడం విశేషం.

‘చివరి బంతి వరకు ఆడాలన్నది మా లక్ష్యం. అందుకే సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేశాం. దీపక్‌ అద్భుతంగా ఆడాడు. రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లో భారత్‌-ఏ తరఫున అతడు పరుగులు చేశాడు. అతడు భారీ షాట్లు ఆడగలడని ద్రవిడ్‌కు తెలుసు. అందుకే, అతడిని ముందుగా పంపించారు. అందుకు తగ్గట్టే ఆడిన చాహర్‌ ఆయన నమ్మకం నిలబెట్టాడు. అతడు బాగా బ్యాటింగ్‌ చేస్తాడని మాకు తెలుసు. ఎందుకంటే రంజీల్లో అతడి బ్యాటింగ్‌ను చూశాం. దీపక్‌ను ముందుగా పంపించడం కఠినమైంది కాకున్నా మంచి నిర్ణయమే’ అని భువీ అన్నాడు.

‘చివరి వరకు ఆడాలనే మేం మాట్లాడుకున్నాం. ఏ దశలోనూ ఇక మనం గెలిచినట్టే అనుకోలేదు. ఒక్కో బంతి ఆడుతూ వెళ్లాం. దీపక్‌ రన్‌రేట్‌ను 6కు మించి పెరగనివ్వలేదు. రిస్క్‌లేని షాట్లే ఆడాడు. ఇక దీపక్‌ నకుల్‌ బంతులను బాగా విసరగలడు. ఈ రెండు మ్యాచుల్లోనూ పిచ్‌ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంది. వాతావరణం ఉక్కగా అనిపించింది. నా బౌలింగ్‌పై సంతృప్తికరంగానే ఉన్నా. కోచ్‌ ద్రవిడ్‌ ఎక్కడా ఆందోళన చెందలేదు. ప్రశాంతంగా ఉన్నారు. మేం గెలిచాక అభినందించారు. హార్దిక్‌ పాండ్యకు ఫిట్‌నెస్‌ ఇబ్బందులేం లేవు’ అని భువీ వెల్లడించాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని