Shikhar Dhawan: కోహ్లీ, శాస్త్రీ చెబితే అలాగే చేస్తాం!

తాజా వార్తలు

Published : 18/07/2021 10:51 IST

Shikhar Dhawan: కోహ్లీ, శాస్త్రీ చెబితే అలాగే చేస్తాం!

టీ20 ప్రపంచకప్‌ ముందు ఇదొక్కటే సిరీస్‌ అంటున్న గబ్బర్‌

కొలంబో: శ్రీలంకతో సిరీసులో తన ఓపెనింగ్‌ భాగస్వామి ఎవరో నిర్ణయించామని టీమ్‌ఇండియా తాత్కాలిక సారథి శిఖర్‌ ధావన్‌ అన్నాడు. జట్టు కూర్పు సిద్ధమైందని పేర్కొన్నాడు. ఎవరైనా ఆటగాడిని పరిశీలించాలని సెలక్టర్లు, రవిశాస్త్రి, విరాట్‌ కోహ్లీ చెబితే అతడినే ఆడిస్తామని వెల్లడించాడు. లంకతో తొలి వన్డేకు ముందు గబ్బర్‌ మీడియాతో మాట్లాడాడు.

‘విరాట్‌ కోహ్లీ , రవిశాస్త్రితో నేనైతే ప్రత్యేకంగా మాట్లాడలేదు. రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్టర్లతో వారు కచ్చితంగా మాట్లాడే ఉంటారని తెలుసు. ఆ సందేశం మాకు అందుతుంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొనే ఈ సిరీసులో ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. రవి భాయ్‌, విరాట్‌ ఎవరి గురించైనా చెబితే మేం వారిని ఆడిస్తాం. ఎందుకంటే ప్రపంచకప్‌ ముందు ఉన్న సిరీసు ఇదొక్కటే’ అని గబ్బర్‌ అన్నాడు.

‘మేం జట్టు కూర్పును నిర్ణయించాం. నా ఓపెనింగ్‌ భాగస్వామి ఎవరో తేల్చుకున్నాం. మ్యాచ్‌కు ముందు అతడెవరో చెబుతాం. మా బృందంలో ఎవరు ఎన్ని మ్యాచులు ఆడతారన్నది తెలియదు. ఎందుకంటే సిరీసు విజయమే మా లక్ష్యం. అత్యుత్తమ 11మందే బరిలోకి దిగుతారు. మెరుగైన స్పిన్నరే జట్టులో ఉంటాడు. అందరినీ ఆడించాలన్న నిబంధనేం లేదు. కుల్‌దీప్‌, యుజ్వేంద్ర చాహల్‌ కలిసి ఆడారు. వారి సమన్వయం బాగుంటుంది. రాహుల్‌ చాహర్‌ సైతం మంచి స్పిన్నరే’ అని శిఖర్‌ తెలిపాడు.

రవిశాస్త్రి కోచింగ్‌లో ఎక్కువగా ఆడినా.. రాహుల్‌ భాయ్‌ కోచింగ్‌నూ ఆస్వాదిస్తున్నానని ధావన్‌ అన్నాడు. ‘వారిద్దరూ భిన్నమైన వ్యక్తులు. ఎవరి బలాబలాలు వారివి. ఇద్దరూ సానుకూలంగా ఉంటారు. నేను రవిభాయ్‌తో ఎక్కువగా గడిపాను. అతడు ప్రేరణ కల్పించే తీరు భిన్నంగా ఉంటుంది. అతడు గంభీరంగా ఉంటాడు. రాహుల్‌ భాయ్‌ ప్రశాంతంగా ఉంటారు. పటిష్ఠంగా, స్థిరంగా కనిపిస్తారు. వారిద్దరి కోచింగ్‌ను నేను ఆస్వాదిస్తాను’ అని వెల్లడించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని