INDvsENG: రెండో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం..

తాజా వార్తలు

Updated : 13/08/2021 17:52 IST

INDvsENG: రెండో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్‌దే ఆధిపత్యం..

లండన్‌: టీమ్ఇండియా రెండో రోజు తొలి సెషన్‌ పూర్తి చేసుకుంది. 276/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ మరో నాలుగు వికెట్లు కోల్పోయి భోజన విరామ సమయానికి 346/7 స్కోర్‌తో నిలిచింది. జడేజా(31), ఇషాంత్‌ శర్మ(0) నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ (129), అజింక్య రహానె(1) ఆట ప్రారంభించగా తొలి రెండు ఓవర్లలోనే ఔటయ్యారు. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో రాహుల్‌.. సిబ్లీ చేతికి చిక్కగా తర్వాతి ఓవర్‌లోనే అండర్సన్‌ బౌలింగ్‌లో రహానె.. రూట్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 282 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. అనంతరం రిషభ్‌ పంత్‌(37), జడేజా నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, పంత్‌ అనుకోకుండా మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కడంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. మరుసటి ఓవర్‌లోనే షమి(0) సైతం మోయిన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలోనే జోడీ కట్టిన జడేజా, ఇషాంత్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ బౌలర్లలో అండర్సన్‌ మూడు వికెట్లు తీయగా రాబిన్‌సన్‌ రెండు, మార్క్‌వుడ్‌, మోయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని