INDvsENG:  నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇక పంత్‌పైనే భారీ ఆశలు

తాజా వార్తలు

Updated : 15/08/2021 23:07 IST

INDvsENG:  నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇక పంత్‌పైనే భారీ ఆశలు

శతక భాగస్వామ్యంతో ఆదుకున్న రహానె, పుజారా

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 181/6తో నిలిచింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. అప్పటికి రిషభ్‌ పంత్‌(14), ఇషాంత్‌ శర్మ(4) నాటౌట్‌గా ఉన్నారు. దాంతో ఈ మ్యాచ్‌పై భారత్‌ పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. చివరిరోజు ఉదయం వేళ పంత్‌ ధాటిగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే భారత్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. అంతకుముందు అజింక్య రహానె(61), చెతేశ్వర్‌ పుజారా(45) నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. 55 పరుగులకే ముగ్గురు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమవడంతో రహానె, పుజారా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ఇద్దరూ ఆచితూచి ఆడారు.

ఈ క్రమంలోనే ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. అయితే, అదే సమయంలో పుజారా అనుకోని బంతికి ఔటయ్యాడు. మార్క్‌వుడ్‌ వేసిన షార్ట్‌పిచ్‌ బంతి అతడి గ్లౌజులకు తగిలి రూట్‌ చేతిలో పడింది. దాంతో భారత్‌ 155 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా పెవిలియన్‌ చేరాడు. మోయిన్‌ అలీ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రవీంద్ర జడేజా(3) సైతం నిరాశపరిచాడు. అతడిని కూడా అలీ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అలా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. ఈ క్రమంలోనే జోడీ కట్టిన పంత్‌, ఇషాంత్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇక అంతకుముందు మార్క్‌వుడ్‌.. రాహుల్‌(5), రోహిత్‌ శర్మ(21)ను ఔట్‌ చేశాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(20) సామ్‌కరన్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ మూడు, మోయిన్‌ అలీ రెండు, సామ్‌కరన్‌ ఒక వికెట్‌ తీశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని