INDvsENG: టీమ్‌ఇండియా ఆలౌట్‌.. తొలి ఇన్నింగ్స్‌ 364

తాజా వార్తలు

Published : 13/08/2021 19:12 IST

INDvsENG: టీమ్‌ఇండియా ఆలౌట్‌.. తొలి ఇన్నింగ్స్‌ 364

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 364 పరుగులకు ఆలౌటైంది. శతక వీరుడు కేఎల్‌ రాహుల్‌ (129; 250 బంతుల్లో 12x4, 1x6) ఆదిలోనే రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మరుసటి ఓవర్‌లో అజింక్య రహానె(1) సైతం పెవిలియన్‌ చేరాడు. శుక్రవారం రాబిన్‌సన్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే రాహుల్‌.. సిబ్లీ చేతికి చిక్కగా తర్వాత అండర్సన్‌ వేసిన మరుసటి ఓవర్‌లోనే రహానె.. రూట్‌ చేతికి చిక్కాడు. దాంతో మ్యాచ్‌ ప్రారంభమైన రెండు ఓవర్లకే భారత్‌ 282/5తో నిలిచింది. ఇక గురువారం తొలిరోజు ఆట పూర్తయ్యే సమయానికి భారత్‌ 276/3 స్కోర్‌తో నిలిచిన సంగతి తెలిసిందే.

అనంతరం జడేజా (40; 120 బంతుల్లో 3x4)తో జోడీ కట్టిన రిషభ్‌ పంత్‌ (37; 58 బంతుల్లో 5x4) కాస్త వేగంగా పరుగులు తీశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, పంత్‌ కుదురుకున్నట్లే కనిపించగా అనూహ్యంగా మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడు కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ 331 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. మరుసటి ఓవర్‌లోనే షమి(0) కూడా పెవిలియన్‌ చేరాడు. ఆపై జడేజా, ఇషాంత్‌ కాస్త నిలకడగా ఆడి ఎనిమిదో వికెట్‌కు 26 పరుగులు జోడించారు. అయితే, 362 పరుగుల వద్ద ఇషాంత్‌ ఔటవ్వగా తర్వాత బుమ్రా, జడేజా సైతం ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ ఐదు వికెట్లు తీయగా రాబిన్‌సన్‌, మార్క్‌వుడ్‌ చెరో రెండు, మోయిన్‌ అలీ ఒక వికెట్ తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని