IPL 2021: ఏబీ డివిలియర్స్‌ విషయంలో అర్థమే లేదు: గంభీర్

తాజా వార్తలు

Published : 08/10/2021 12:46 IST

IPL 2021: ఏబీ డివిలియర్స్‌ విషయంలో అర్థమే లేదు: గంభీర్

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ కీలక ఆటగాడైన ఏబీ డివిలియర్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని మాజీ క్రికెటర్‌ గౌంతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంతకుముందు టాప్‌ ఆర్డర్‌లో ఆడే దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఈ సీజన్‌లో పలు మ్యాచ్‌ల్లో ఆరో స్థానంలో ఆడుతున్నాడు. దీంతో మ్యాచ్‌ ఫినిషర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయంపై గంభీర్‌ స్పందించాడు. డివిలియర్స్‌తో ఓపెనింగ్‌ చేయించాలని.. లేదా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గానైనా ఆడించాలని గంభీర్‌ సూచించాడు.

‘బెంగళూరు జట్టు డివిలియర్స్‌ను ఎప్పటికీ ఓపెనర్‌గా లేదా నంబర్‌ 3 బ్యాట్స్‌మన్‌గా ఆడించాలి. నా దృష్టిలో అతడు ఆరోస్థానంలో ఆడటంలో అర్థమేలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగడమే నేను ఇష్టపడతాను. అతడో అద్భుతమైన ఆటగాడు. అందుకే నేను డివిలియర్స్‌ ఆటను ఎక్కువగా చూడాలనుకుంటున్నా. అలాగే ఆ జట్టు మూడో స్థానంలో డానియెల్‌ క్రిస్టియన్‌ను ఆడించొద్దు. కానీ వాళ్లు అదే పని చేస్తారు. అతడికి బదులు శ్రీలంక ఆటగాళ్లు దుష్మంత చమీరా, వానిండు హసరంగను ఆడించాలి’ అని గంభీర్‌ వివరించాడు. కాగా, ఈ సీజన్‌లో డివిలియర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి మొత్తం 276 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని