Ganguly Biopic:  త్వరలో నా బయోపిక్‌ రానుంది:గంగూలీ

తాజా వార్తలు

Published : 10/09/2021 01:51 IST

Ganguly Biopic:  త్వరలో నా బయోపిక్‌ రానుంది:గంగూలీ

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అభిమానులకు తీపికబురు అందింది. త్వరలోనే అతడి జీవిత కథ ఆధారంగా గంగూలీ బయోపిక్‌ రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా దాదానే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇన్నిరోజులు బుల్లితెర, సామాజిక మాధ్యమాల్లో అతడి ఆటను, నాయకత్వాన్ని, క్రికెట్‌ పాలకునిగా చూసిన మనకు ఇప్పుడు వెండితెరపై చూసే సౌలభ్యం దొరికింది.

గంగూలీ కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్‌ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించాడు. ‘క్రికెటే నా జీవితంగా మారింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఏ సందర్భంలోనూ తలవంచకుండా ముందుకు సాగడాన్ని నేర్పింది. ఈ ప్రయాణం ఆస్వాదించదగినది. లవ్‌ఫిల్మ్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ నా జీవితాన్ని వెండితెరపైకి సాక్ష్యాత్కరించే బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ దాదా తీపికబురు పంచుకున్నాడు. కాగా, ఇప్పటివరకైతే ఆ బయోపిక్‌లో ఎవరు నటిస్తారో ఇంకా సమాచారం తెలియనప్పటికీ.. గతంలో దాదా ఓ సందర్భంలో మాట్లాడుతూ తన బయోపిక్‌లో హృతిక్‌రోషన్‌ నటిస్తే బాగుంటుందని అన్నాడు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. మరి గంగూలీ ఆశించినట్టు హృతిక్‌ ఆ పాత్రను పోషిస్తాడా లేక మరెవరైనా ఆ బాధ్యతలు తీసుకుంటారా వేచి చూడాలి.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని