Virat Kohli Back pain: కోహ్లి వెన్ను నొప్పి అలా మాయం!

తాజా వార్తలు

Updated : 22/09/2021 11:06 IST

Virat Kohli Back pain: కోహ్లి వెన్ను నొప్పి అలా మాయం!

దిల్లీ: ఎంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లనైనా ఏదో ఒక దశలో గాయాలు వేధించడం మామూలే. విరాట్‌ కోహ్లి కూడా అందుకు మినహాయంపు కాదు. అతణ్ని 2014లో వెన్నునొప్పి బాగానే వేధించిందట. ప్రతి రోజూ దాని వల్ల ఇబ్బంది పడ్డాడట. అయితే అప్పటి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు సాయంతో ఆ సమస్యను అధిగమించాడట. ఈ విషయాన్ని బసు రాసిన ఓ పుస్తకంలో కోహ్లి పంచుకున్నాడు.

‘‘2014లో వెన్ను నొప్పి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రతి రోజూ ఉదయం లేవగానే నడుం పట్టేసినట్లుండేది. 45 నిమిషాల కసరత్తుల తర్వాత కానీ అది మామూలయ్యేది కాదు. రోజు మధ్యలో ఏదో ఒక దశలో మళ్లీ సమస్య తలెత్తేది. అప్పుడు బసు సర్‌తో మాట్లాడా. ఆయన కొన్ని వెయిట్‌ లిఫ్టింగ్‌ కసరత్తులు చెప్పాడు. కానీ అవి చేయడానికి నాకు మనస్కరించలేదు. కానీ ‘‘నన్ను నమ్ము’’ అని చెప్పి బసు ఆ కసరత్తులు చేయించాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. స్ట్రెంత్, కండిషనింగ్‌ ప్రాధాన్యమేంటో అప్పుడే నాకు తెలిసింది’’ అని కోహ్లి పేర్కొన్నాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని