Shikha Pandey : శిఖా పాండే.. ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ చూశారా..?

తాజా వార్తలు

Published : 11/10/2021 02:06 IST

Shikha Pandey : శిఖా పాండే.. ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ చూశారా..?

(Photo: BCCI Women Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య శనివారం రాత్రి జరిగిన రెండో టీ20లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆసీస్‌ ఛేదనలో భారత పేసర్‌ శిఖా పాండే వేసిన ఓ బంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో ఆమె వేసిన రెండో బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్‌ అలీసా హేలీ క్లీన్‌బౌల్డ్‌ అయింది. ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడిన బంతి వికెట్లకు దూరంగా వెళుతుందని అనిపించినా..  అనూహ్యంగా ఇన్‌స్వింగై వికెట్లను ఎగరగొట్టింది. దీంతో అక్కడున్న వారే కాకుండా మ్యాచ్‌ చూస్తున్నవారూ ఆశ్చర్యపోయారు. గొప్పగా ఇన్‌ స్వింగ్‌ వేశావంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ దీన్ని ‘బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా అభివర్ణించాడు. మరికొందరు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ నమ్మశక్యంగా లేదంటూ కొనియాడుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షెఫాలి వర్మ (3)తో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (7) విఫలమైంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (28; 20 బంతుల్లో 5×4) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే భారత్‌ 52 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం పూజ (37 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 2×6), దీప్తి శర్మ (16; 19 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి జట్టుకు పోరాడే స్కోర్‌ అందించారు. తర్వాత  రాజేశ్వరి గైక్వాడ్‌ (3/21) ధాటికి ఛేదనలో ఆస్ట్రేలియా 46  పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కానీ, తాలియా మెక్‌గ్రాత్‌ (42 నాటౌట్‌; 33 బంతుల్లో 6×4), బెత్‌ మూనీ (34; 36 బంతుల్లో 4×4) పోరాడి ఆస్ట్రేలియాను గెలిపించారు. అయితే, ఈ మ్యాచ్‌లో శిఖా వేసిన ఇన్‌స్వింగర్‌ బంతే హైలైట్‌గా నిలిచింది. ఆ వీడియో మీ కోసం..



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని