IPL 2021: నాలుగు కోసం.. నలుగురు పోటీ.. ఎవరికి దక్కేనో..?

తాజా వార్తలు

Published : 07/10/2021 01:14 IST

IPL 2021: నాలుగు కోసం.. నలుగురు పోటీ.. ఎవరికి దక్కేనో..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2021 సీజన్‌ తుది దశకు చేరుకుంది. ఇప్పటికివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని నిస్సారంగా సాగగా.. ఎక్కువ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. నాలుగు బెర్తుల ప్లే ఆఫ్స్‌ రేసులో ఇప్పటికే మూడు జట్లు ఖరారయ్యాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం. దీని కోసం రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరో రెండు జట్లకు అదృష్టం కలిసి రావాల్సి ఉంది. మరి ఆ జట్లేవి, ఇప్పటివరకు వాళ్ల ఆటతీరు ఏంటి, నాలుగో బెర్త్‌ సాధించాలంటే ఏం చేయాలి వంటి విషయాలు చూసేద్దాం!


రెండో అంచెలో చెలరేగిన కేకేఆర్‌ 

🏏 విజయంతో సీజన్‌ను ప్రారంభించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. 

🏏 కరోనాతో వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. 

🏏 సెకండ్‌ ఫేజ్‌ యూఏఈకి మారింది.. కేకేఆర్‌ తలరాత మారిందనే చెప్పొచ్చు. వరుసగా రెండు భారీ విజయాలతో ఫామ్‌లోకి వచ్చింది. 

🏏 రెండో ఫేజ్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో పోటీ పడిన కేకేఆర్‌ నాలుగు విజయాలు సాధించింది. 

🏏 ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచుల్లో ఆరు విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌ రేసులో ముందుంది.

🏏 ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లోకి నేరుగా వెళ్లే అవకాశాలు కేకేఆర్‌కు పుష్కలంగా ఉన్నాయి.


డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇలా...

🏏 ఐపీఎల్‌ చరిత్రలోనే ఐదు సార్లు ట్రోఫీని అందుకున్న ఏకైక జట్టు ముంబయి ఇండియన్స్.

🏏 బ్యాటర్లు.. అటు బౌలర్లు అంతా అగ్రశ్రేణి ఆటగాళ్లే. అయితే ఈసారి మాత్రం ముంబయికి అదృష్టం కలిసిరాలేదు.

🏏 ఎప్పుడూ టాప్‌లోనే ఉండే ముంబయి ఈసారి ప్లే ఆఫ్స్‌ కోసమే కష్టపడాల్సి వస్తోంది.

🏏 ప్లే ఆఫ్స్‌ మీద ఆశలు కోల్పోయిన వేళ.. మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఘన విజయం సాధించి మళ్లీ రేసులోకి వచ్చింది. 

🏏 ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన ముంబయి కేవలం ఆరు విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లను మాత్రమే సాధించింది. 

🏏 మిగిలిన ఏకైక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మీద ఘన విజయం సాధించాల్సి ఉంటుంది.


ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే... 

ప్లే ఆఫ్స్‌లో మిగిలిన నాలుగో స్థానం సాధించే అవకాశం ఎక్కువగా రెండు జట్లకే ఉంది. ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చెరో ఆరేసి విజయాలతో పన్నెండేసి పాయింట్లు సాధించాయి. కేకేఆర్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచుల్లో రాజస్థాన్‌తో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌తో ముంబయి తలపడతాయి.

🏏 రాజస్థాన్‌ మీద కేకేఆర్‌ గెలిచి.. సన్‌రైజర్స్‌ మీద ముంబయి ఓడిపోతే.. ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోల్‌కతాకు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. 

🏏 రాజస్థాన్‌పై కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌ మీద ముంబయి భారీ విజయాలు సాధిస్తే ఇరు జట్ల పాయింట్లు 14 అవుతాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఎక్కువ రన్‌రేట్‌ ఉన్న జట్టు ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది.

🏏 ఒకవేళ రాజస్థాన్‌ మీద కేకేఆర్‌ ఓడిపోయి.. సన్‌రైజర్స్‌ మీద ముంబయి గెలిస్తే... అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముంబయి ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లిపోతుంది.

🏏  రాజస్థాన్‌ చేతిలో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌పై ముంబయి ఓటమిపాలై.. పంజాబ్‌ కూడా తన చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే మీద భారీ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ నాలుగో స్థానం ఎంట్రీ కాస్త సంక్లిష్టమవుతుంది. అప్పుడు కేకేఆర్‌ (12 పాయింట్లు), ముంబయి (12), రాజస్థాన్‌ (12), పంజాబ్‌ (12) సమానంగా ఉంటాయి. ఈ సమయంలో నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది.


ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైన జట్లు ఇవి..

🏏 దిల్లీ క్యాపిటల్స్‌ 13 మ్యాచుల్లో 10 విజయాలు.. మూడు ఓటములతో 20 పాయింట్లు సాధించి తొలి స్థానంలో ఉంది. 

🏏 చెన్నై సూపర్‌ కింగ్స్‌ 13 మ్యాచుల్లో పోటీపడగా.. తొమ్మిది విజయాలు, నాలుగు ఓటములతో 18 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 

🏏 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 13 మ్యాచుల్లో 8 విజయాలు, 5 ఓటములతో 16 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకుంది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని