
తాజా వార్తలు
మీరే ఈ ప్రయాణాన్ని అందంగా మలిచారు
అభిమానులకు కోహ్లీ కృతజ్ఞతలు..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ తాజాగా ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లను సంపాదించుకున్న సందర్భంగా అభిమానుకు కృతజ్ఞతలు తెలిపాడు. బుధవారం ఈ మేరకు ఇన్స్టాలో ఒక పోస్టు చేసిన అతడు తనను అనుసరిస్తున్న వారికి రుణపడి ఉంటానన్నాడు. ‘మీరే ఈ ప్రయాణాన్ని అందంగా మలిచారు. మీరు చూపించే ఈ ప్రేమకు సంతోషం కలుగుతోంది. మీ అభిమానానికి రుణపడి ఉంటాను’ అని పోస్టుచేశాడు.
ఇన్స్టాలో పది కోట్ల మంది అనుసరిస్తున్న క్రికెటర్ కోహ్లీయే. సోమవారం రాత్రి ఈ మైలురాయిని చేరుకున్న విరాట్.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగానే కాకుండా ఆసియాలోనే తొలి సెలబ్రిటిగా సంచలనం సృష్టించాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది అనుసరిస్తున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో(227 మిలియన్లు), లియోనెల్ మెస్సీ(187 మిలియన్లు), నెయ్మర్(147 మిలియన్లు) తర్వాత విరాట్ (100 మిలియన్లు) ఉన్నాడు. భారత్లో టీమ్ఇండియా సారథి తర్వాత ప్రియాంక్ చోప్రా (60.9 మిలియన్లు), శ్రద్ధా కపూర్(58.1 మిలియన్లు), దీపికా పడుకొణె(53.3 మిలియన్లు), అలియా భట్(51.1మిలియన్లు) ఉన్నారు.