పాంటింగ్‌కు సెహ్వాగ్‌ అదిరే పంచ్: నవ్విన పంత్‌

తాజా వార్తలు

Updated : 11/01/2021 21:23 IST

పాంటింగ్‌కు సెహ్వాగ్‌ అదిరే పంచ్: నవ్విన పంత్‌

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టును ఆసీస్‌ మాజీలు తక్కువగా అంచనా వేస్తున్నారు. కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా ఘోర ఓటములను చవిచూస్తుందని అన్నారు. అంతేగాక అడిలైడ్‌లో 36 పరుగులకే భారత్ ఆలౌటవ్వడంతో 4-0తో ఆసీస్‌దే టెస్టు సిరీస్ అని‌ జోస్యం చెప్పారు. కానీ మెల్‌బోర్న్‌లో రహానెసేన ఘన విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది.

బాక్సింగ్ డే టెస్టుతోనైనా టీమిండియా సత్తాను తెలుసుకున్నారనుకుంటే.. మరోసారి ఆసీస్‌ మాజీలు అదే బాట పట్టారు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాను ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ తక్కువగా అంచనా వేశాడు. నాలుగో రోజు (ఆదివారం) ఆట జరుగుతున్న సమయంలో అభిమానుల అడిగిన కొన్ని ప్రశ్నలకు పాంటింగ్‌ సమాధానమిచ్చాడు. ‘ఆస్ట్రేలియా ఏ స్కోరు వద్ద డిక్లేర్‌ చేస్తుందని భావిస్తున్నార’ని ఓ నెటిజన్‌ అడగ్గా... దానికి పాంటింగ్ ‘ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌ ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 200 పరుగులను కూడా చేయలేదు’ అని బదులిచ్చాడు.

కానీ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్‌ను డ్రా గా ముగించింది. 407 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అయిదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. పంత్ (97), పుజారా (77), అశ్విన్‌ (39*), విహారి (23*) గొప్పగా ఆడారు. దీంతో పాంటింగ్‌పై నెట్టింట్లో మీమ్స్‌ వస్తున్నాయి. జోస్యం బాగా చెప్పారని వ్యంగ్యంగా పోస్ట్‌లు చేస్తున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా పాంటింగ్‌పై సెటైర్‌ వేశాడు. పాంటింగ్ చెప్పిన సమాధానాన్ని రీట్వీట్‌ చేస్తూ.. పాంటింగ్‌-పంత్‌ ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. దీనికి నవ్వుతున్న ఎమోజీని జోడించి పంత్ రీట్వీట్‌ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి

‘ఛీటర్‌ స్మిత్’! ఇంకా మారలేదా?

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

దెబ్బ అదుర్స్‌ కదూ: సెహ్వాగ్‌
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని