IPL 2021:ఆఖరి బంతికి శ్రీకర్‌ సిక్స్‌.. సెలబ్రేషన్స్‌తో రచ్చ రచ్చ చేసిన కోహ్లి! 

తాజా వార్తలు

Updated : 10/10/2021 05:24 IST

IPL 2021:ఆఖరి బంతికి శ్రీకర్‌ సిక్స్‌.. సెలబ్రేషన్స్‌తో రచ్చ రచ్చ చేసిన కోహ్లి! 

(Photo: Royal Challengers Bangalore Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: విరాట్ కోహ్లి క్రికెట్‌ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. ఎప్పుడూ హుషారుగా ఉంటూ ఆటగాళ్లలో జోష్ నింపుతాడు. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటాడు. బ్యాటుతోనే కాదు.. మాటతోనూ సమాధానం ఇవ్వగల దిట్ట. మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పుడు కూడా విరాట్‌ ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఐపీఎల్‌లో కూడా కోహ్లి ఇదే పంథాను అనుసరిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఆర్‌సీబీ, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్ (78 నాటౌట్ ; 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)  ఆఖరి బంతికి సిక్సర్ బాది ఆర్‌సీబీని విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఆర్‌సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఒక రేంజ్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఆటగాళ్లతో విజయానందాన్ని పంచుకుని వెంటనే ముసిముసి నవ్వులు నవ్వుతూ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. సిక్సర్‌ బాది జట్టును గెలిపించిన భరత్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలుపొందిన కోహ్లీ సేన 18 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కి కూడా 18 పాయింట్లే ఉన్నా మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక, సోమవారం జరగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. క్వాలిఫయర్ -1 లో ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. టాప్‌-2 జట్లు దిల్లీ, చెన్నై క్వాలిఫయర్‌లో తలపడబోతున్నాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని