close

తాజా వార్తలు

Published : 13/08/2020 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌కు ఎంపికవ్వలేదని క్రికెటర్‌ ఆత్మహత్య

జూనియర్‌ స్టెయిన్‌గా అందరికీ పరిచయం

(చిత్రం: ట్విటర్‌ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-2020కి ఎంపికవ్వలేదన్న మనస్తాపంతో ఓ వర్ధమాన క్రికెటర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబయిలోని మలాద్‌లోని తన ఇంటిలో కరణ్‌ తివారీ అనే క్లబ్‌ క్రికెటర్‌ ఉరి బిగించుకొన్నాడు. అతడి బౌలింగ్‌ శైలి అచ్చం దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌లా ఉండటంతో అందరూ అతడిని ‘జూనియర్‌ స్టెయిన్‌’ అని పిలుస్తుంటారు.

కొంతకాలంగా కరణ్‌ కుంగుబాటుకు గురయ్యాడు. ఐపీఎల్‌కు ఎంపికవ్వలేదని ఆవేదన చెందాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రాత్రి 10:30 గంటల వరకు అతడు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి పడకగది తలుపులు బద్ధలు కొట్టి చూశారు. జరిగిన ఘోరం చూసి విలపించారు. పోలీసులు యాక్సిడెంటల్‌ డెత్‌‌గా కేసు నమోదు చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకొనే ముందు ఉదయ్‌పూర్‌లోని తన మిత్రుడికి కరణ్‌ ఫోన్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే అతడు అదే పట్టణంలో ఉన్న కరణ్‌ సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె ఇంటికి ఫోన్‌ చేసేలోపే ఆలస్యమైంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏ వయసు విభాగంలోనైనా రాష్ట్రం తరఫున ఆడితే ఐపీఎల్‌ వేలంలో పాల్గొనేందుకు అర్హులు. కరణ్‌ ఎప్పడూ రాష్ట్ర స్థాయిలో రాణించలేదని తెలిసింది. అయితే వాంఖడేలో ముంబయి ఇండియన్స్‌ సహా ఇతర ఫ్రాంచైజీ క్రికెటర్లకు నెట్స్‌లో అతడు బంతులు విసిరాడని సమాచారం. క్లబ్‌ క్రికెట్‌లో రాణిస్తున్నాడని స్నేహితులు చెబుతున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.