IPL 2021: ప్రాక్టీస్‌లో తలమునకలైన సీఎస్కే ఆటగాళ్లు..
Array ( [0] => stdClass Object ( [video_type] => 3 [video_short_link] => 1428952585306730498 ) ) 1

కథనాలు

Published : 21/08/2021 22:45 IST

IPL 2021: ప్రాక్టీస్‌లో తలమునకలైన సీఎస్కే ఆటగాళ్లు..

(Photo:CSK Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే నెల 19న పున:ప్రారంభం కానున్న ఐపీఎల్-14 కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రాక్టీస్‌ మొదలెట్టింది. సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్‌, కర్ణ్ శర్మ, రాబిన్‌ ఊతప్పతోపాటు మరికొంతమంది ఆటగాళ్లు ఈ నెల 13న యూఏఈకి చేరుకున్నారు. వారం రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం ధోనీసేన ప్రాక్టీస్‌ను షురూ చేసింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నారు.

శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆడి సాధన మొదలెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎస్కే ట్విటర్‌లో పోస్టు చేసింది. ధోనీ, సురేశ్ రైనా, ఊతప్ప, కర్ణ్ శర్మ ఫుట్‌బాల్ ఆడుతూ హుషారుగా కనిపించారు. అనంతరం నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక, ఐపీఎల్ విషయానికొస్తే.. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు కొవిడ్ బారినపడటంతో మే మొదటివారంలో అర్ధంతరంగా వాయిదాపడింది. మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణపై అనేక సమాలోచనలు చేసిన బీసీసీఐ చివరకు యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. 

సెప్టెంబరు 19న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ వాయిదాపడే నాటికి  ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్‌.. ఆరు విజయాలను సాధించి అగ్రస్థానంలో ఉంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన