మాస్టర్‌.. కొవిడ్‌ను సిక్సర్‌ బాదేయాలి!
Array ( [0] => stdClass Object ( [video_type] => 3 [video_short_link] => 1377913922682900481 ) ) 1

కథనాలు

Published : 03/04/2021 01:37 IST

మాస్టర్‌.. కొవిడ్‌ను సిక్సర్‌ బాదేయాలి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ను పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ పరామర్శించారు. కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బంతి మాదిరిగా కరోనా వైరస్‌ను సిక్సర్‌గా బాదేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ ఆడిన సచిన్‌కు కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది. పదేపదే పరీక్షలు చేయించుకొంటూ.. జాగ్రత్తలు తీసుకుంటూ.. బయో బుడగలో ఉన్నప్పటికీ తనకు వైరస్‌ సోకిందని మాస్టర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల వరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఆయన శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. అభిమానులు ఆందోళన చెందడంతో ముందు జాగ్రత్తగా చేరానని బదులిచ్చారు. సచిన్‌తో పాటు యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, బద్రీనాథ్‌కు పాజిటివ్‌ రావడం గమనార్హం.

‘పదహారేళ్లు ఉన్నప్పుడే నువ్వు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు... కాబట్టి నువ్వు కొవిడ్‌-19ని సిక్సర్‌ బాదేస్తావని నా నమ్మకం! త్వరగా కోలుకో మాస్టర్‌! టీమ్‌ఇండియా 2011 ప్రపంచకప్‌ విజయాన్ని వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి వేడుక చేసుకుంటే బాగుంటుంది. అలాగే నాకో ఫొటో పంపించు!’ అని వసీమ్‌ అక్రమ్‌ ట్వీట్‌ చేశాడు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన