
ప్రధానాంశాలు
నాలుగోరోజు మరో 30 మందికి అస్వస్థత
వికారాబాద్, నవాబుపేట, న్యూస్‌టుడే: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బారినపడి అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, కల్లు లభించక వింతగా ప్రవర్తిస్తూ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం వికారాబాద్ మండలానికి చెందిన 12 మంది, నవాబుపేట మండలానికి చెందిన 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మంది వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నవాబుపేట మండలం ఎక్‌మామిడికి చెందిన సుమిత్ర కల్లు లభించక మంగళవారం పురుగుల మందు తాగారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారు ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఆమె మృతి చెందారు. ఇప్పటి వరకు కల్తీ కల్లు బారినపడి, కల్లు లభించక అస్వస్థతకు గురైన వారి సంఖ్య 354కు చేరింది. రోజూ తాగే అలవాటున్న వారు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వింతగా ప్రవరిస్తున్నారు. కొందరు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు వెళ్లి కల్లు తెచ్చుకొని తాగుతున్నట్లు సమాచారం.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్