
ప్రధానాంశాలు
బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాసంస్థలు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈనెల 25 నాటికి అన్ని తరగతుల వసతి గృహాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఇక్కడి పౌరసరఫరాల భవన్లో రెండు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లలో 70,983 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి వసతులను యుద్ధప్రాతిపదికన అధికారులు సిద్ధం చేయాలి. వసతిగృహాలు, పాఠశాలల్లో పారిశుద్ధ్య చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను అధికారులు ఏమేరకు తీర్చిదిద్దారో ఎమ్మెల్యేలు, మంత్రులు ఈనెల 26 నుంచి తనిఖీ చేస్తారు. 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. 74 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. వాటిని హాస్టళ్లకు తరలించాలి. ఇతర వస్తువులను అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి కమలాకర్ స్పష్టంచేశారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- గబ్బాలో కొత్త హీరోలు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!