close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రావతరణ వేడుకలు

జాతీయ జెండా ఎగురవేసే వారి పేర్లు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌ : వచ్చే నెల రెండో తేదీన జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో 32 జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేసే వారి పేర్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఇతర ప్రముఖులను ఇందుకు ఎంపిక చేసింది. వేడుకల్లో జెండా కోడ్‌-2002, కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జెండా వందనం చేస్తారు. జిల్లాల్లో ఎంపిక చేసిన వారు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, పురపాలక సంఘాల ఛైర్‌పర్సన్లు పాల్గొనాలని, వీరు తమతమ కార్యాలయాల్లో ఉదయం 8.30కి పతాకావిష్కరణ చేసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వివరించింది. ఎంపీపీలు, సర్పంచులు కూడా పతాకావిష్కరణ చేయాలని పేర్కొంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరగాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో తేనీటి విందు నిర్వహించాలని వివరించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.