close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్ష పిడకలతో భోగి పండగ

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండగను వినూత్నంగా జరుపుకునేందుకు శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం మురపాక గ్రామస్థులు సిద్ధమయ్యారు. యువకులు, మహిళలు 20 రోజులు శ్రమించి లక్ష పిడకలు తయారు చేశారు. ఒక్కొక్కరు వెయ్యి నుంచి 10 వేల వరకు చేశారు. అందరూ తయారు చేసిన పిడకలను యువకులు ఇంటింటికీ వెళ్లి సేకరించారు. వీటిని బుధవారం నిర్వహించే భోగి మంటల్లో వేయనున్నట్లు యువజన సంఘాల సభ్యులు తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు