సిల్లీపాయింట్‌ - Sunday Magazine
close

సిల్లీపాయింట్‌

గాఢనిద్రలో ఉన్నప్పుడు మనకు వాసన తెలియదు.

* కాలిగోళ్లకన్నా చేతిగోళ్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి.

* ప్రేమలో పడడమంటే భయపడటాన్ని ఫైలోఫోబియా అంటారు.

* కప్పలగుంపును ‘ఆర్మీ’ అంటారు.

* అంతరిక్షంలో పక్షులు బతకలేవు. ఆహారం మింగడానికి వాటికి గురుత్వాకర్షణ శక్తి అవసరం.

* ముక్కు మూసుకుని కూనిరాగాలు తీయలేం.

* 2019లో బంగ్లాదేశ్‌లో - రెండు గర్భాశయాలున్న ఒక మహిళకు ఒక గర్భసంచిలోని బిడ్డ జన్మించిన నెల తరువాత రెండో గర్భసంచిలోని కవలలు పుట్టారు. ఇలాంటి సంఘటన ప్రపంచంలో అదే ప్రథమమట.

* ఫ్లెమింగోల గుడ్లలోపలి సొన గులాబీరంగులో ఉంటుంది.

* కారంగా ఉండే ఆహారాన్ని తినే ఏకైక జీవి మనిషి

* మనకు మనమే కితకితలు పెట్టుకోవడం అసాధ్యం.

* కొత్త పెన్ను కొనేటప్పుడు బాగా రాస్తుందో లేదో చూడాలంటే- నూటికి 97 మంది తమ పేరే రాస్తారట.

* చల్లని నీళ్ల కంటే వేడినీరు త్వరగా గడ్డకడుతుంది.

* మనిషి శరీరంలో అన్నిటికన్నా బలమైన కండరం ‘నాలుక’.

* మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెడితే ద్రాక్షపండ్లు పేలిపోతాయి.

* ఎలుకలు వాంతి చేసుకోలేవు. కాబట్టే ఎలుకల మందు వాటిపై బాగా పనిచేస్తుంది.

* సముద్రాల సగటు లోతు రెండు మైళ్లు.

* గోడ గడియారంలో గంటలముల్లు వేగం గంటకు 0.00000275 మైళ్లు.

* పూర్తిగా పెరిగిన అరటిగెల బరువు సగటున 11 కిలోల దాకా ఉంటుంది.


సింహం అరుపును ఐదుమైళ్ల దూరం నుంచి కూడా వినవచ్చు.


పిల్‌ పండ్లలో మూడోవంతు గాలి ఉంటుంది. అందుకే అవి నీళ్లలో తేలతాయి.


లూసియానాలో గులాబీరంగు డాల్ఫిన్‌ ఉంది. దాన్ని పింకీ అని పిలుస్తారు. జన్యుపరమైన కారణాల వల్ల ఆ వర్ణం సంక్ర మించిందట.


డవడం వల్ల శరీరంలో- నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్లూ ఆనందానికి దోహదపడే ఆక్సిటోసిన్‌ విడుదలవుతాయి. అందువల్లనే, ఏడ్చినప్పుడు (ఒత్తిడీ ఉద్వేగం తగ్గి) మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది.


చంద్రుడి మీద మానవుడి తొలి అడుగుజాడలు దాదాపు 5 లక్షల సంవత్సరాలు నిలిచి ఉంటాయి.


లింపిక్స్‌ జెండాలో- తెలుపుమీద ఐదురంగుల వృత్తాలుంటాయి. ప్రతి దేశపు జెండాలోనూ ఈ ఆరురంగుల్లో కనీసం ఏదో ఒకటి తప్పక ఉంటుంది.


ప్రపంచ దేశాలన్నింటిలోనూ టూరిస్టులు ఎక్కువగా వేళ్లే దేశం ఫ్రాన్స్‌.ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న