సాగర తీరాన... రంగుల పొదరిళ్లు! - Sunday Magazine
close

సాగర తీరాన... రంగుల పొదరిళ్లు!

సుక తిన్నెల్లో హరివిల్లు విరబూసిందా అన్నట్టున్నాయి కదూ ఈ చిత్రాలు! అందంగా పేర్చిన పొదరిళ్లలా ఉన్న ఈ బీచ్‌ హట్స్‌ ఇంగ్లాండ్‌లోని మెర్సియా ఐలాండ్‌లోనివి. చూడచక్కని ప్రకృతి అందాలతో అలరించే ఇక్కడి సముద్రతీరానికి... ఈ చిట్టిపొట్టి ఇళ్లే అదనపు ఆకర్షణ! బీచ్‌కి వచ్చే పర్యటకుల కోసం స్థానిక కంపెనీ వీటిని ఏర్పాటుచేసింది. తీరంలో కుటుంబంతో సహా రోజంతా ఆహ్లాదంగా గడపాలనుకున్నప్పుడు... మనకు నచ్చిన హట్‌ను అద్దెకు తీసుకోవచ్చు. అందులో సోఫాలు, డైనింగ్‌ టేబుల్‌ వంటి అన్ని సౌకర్యాలూ ఉంటాయి.

బయటి రంగులే కాదు... ఇంటీరియర్‌ కూడా ప్రతిదీ విభిన్నంగా ఉండేలా డిజైన్‌ చేశారు. కావాలనుకుంటే అక్కడే వంట కూడా చేసుకోవచ్చు. లేదంటే సిబ్బందికి ఆర్డరిస్తే వారే మనకు నచ్చిన పదార్థాలు సర్వ్‌ చేస్తారు. ఇక్కడి సీఫుడ్‌ రుచి అదిరిపోతుందట! ఇంత అందంగా ఉన్నచోటికి పర్యటకులు భారీగా వస్తుంటారంటే అందులో ఆశ్చర్యమేముంది!

 

 

 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న