కేకులు... పూసలద్దుకున్నాయి..! - Sunday Magazine
close

కేకులు... పూసలద్దుకున్నాయి..!

సంతోషకరమైన సందర్భాన్ని తియ్యని వేడుకలా చేసుకోవాలంటే కేకు ఉండాల్సిందే. అందుకే కళాకారులు కేకు తయారీలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలు చేస్తూనే కేక్‌కి వెరైటీ లుక్‌ తీసుకొస్తుంటారు. ఇదిగోండి, ఇక్కడున్న కేకులు అలా వచ్చినవే. ఇదివరకు ఫొటో ప్రింట్లూ, త్రీడీ బొమ్మలూ, రియలిస్టిక్‌ చిత్రాలూ... ఇలా ఎన్నెన్నో రూపాల్లో నోరూరించిన కేకులను కాస్త సింపుల్‌గానూ విభిన్నంగానూ ట్రై చేద్దామనుకుని ఈ బీడ్స్‌ కేక్స్‌కి రూపమిచ్చింది అమెరికాకు చెందిన కేక్‌ ఆర్టిస్టు సియన్‌ అమీ పెటిట్‌. ఐసింగ్‌ షుగర్‌తో ఎంతోతీరుగా కేకుపైన చిన్న చిన్న చుక్కల్ని అలంకరిస్తూ - రంగు రంగుల సన్నని పూసల్నే పూల డిజైన్లలా, ముచ్చటైన బొమ్మల్లా కుట్టినట్టు కనిపించేలా- కేకుల్ని తీర్చిదిద్దుతోంది. కేక్‌ లవర్స్‌కి ఈ బీడ్స్‌కేక్స్‌ ఎంతైనా నచ్చేస్తాయి కదూ!


‘జాంగ్జియాజీ నేషనల్‌ ఫారెస్ట్‌ పార్క్‌’... చైనాలో ఉన్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా వెయ్యి అడుగుల ఎత్తైన సన్నటి పొడవాటి పర్వతాలే దర్శనమిస్తాయి. వీటిపైకి ఇప్పుడు ఎవరైనా నిమిషాల్లో చేరుకోవచ్చు. అదెలా అంటారా... అక్కడ 1070 అడుగుల ఎత్తున్న ఓ పర్వతానికి లిఫ్టుని అమర్చారు మరి. రూ.146 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ బైలాంగ్‌ ఎలివేటర్‌ ప్రపంచంలోనే పొడవైన ఆరుబయటి లిఫ్ట్‌ అట. దీన్లో ఎక్కి ఆ పర్వతం పైభాగానికి వెళ్లినవారు అక్కడ కాసేపు గడిపేందుకూ ఏర్పాట్లు చేశారు. అంటే, పైనుంచే మిగిలిన పర్వతాలన్నిటినీ చూసే వీలుందన్నమాట. పెద్ద పెద్ద భవనాలూ షాపింగ్‌ మాల్స్‌లో లిఫ్టులు పెట్టడం తెలిసిందే. కానీ, ఇలా పర్వతం పైకి లిఫ్ట్‌ అంటే వినడానికీ చూడటానికీ కూడా ఆశ్చర్యంగా ఉంది కదూ..!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న