ఇవి ఆడే యాప్స్‌ కాదు... ఆడించే యాప్స్‌
close

Published : 16/11/2020 11:37 IST
ఇవి ఆడే యాప్స్‌ కాదు... ఆడించే యాప్స్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఫ్రీ వెర్షన్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: చిన్నతనంలో సీతా-రాముడు, స్టార్‌ లాంటి ఆటలు ఆడేటప్పుడు స్కోరు వేయడానికి పెన్ను, పేపర్ పక్కన పెట్టుకునేవాళ్లం. మరి ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు స్కోరు కోసం పెన్నూ పేపర్‌ అవసరమా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే దీని కోసం నేటి తరం దాని కోసం కొత్త యాప్‌లను సృష్టించింది. ఒకేసారి చాలా మంది ఆడుతున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి అలాంటి ఆడించే ఆండ్రాయిడ్‌ యాప్‌ల గురించి తెలుసుకుందామా...?

టాపర్‌గా నిలిస్తే.. 

గేమ్స్‌కు స్కోరు వివరాలు నమోదు చేసుకునేందుకు స్కోర్‌ కౌంటర్‌ (Score Counter) సరిగ్గా సరిపోతుంది. కొత్త కౌంట్‌ను ఎంటర్‌ చేసినప్పుడల్లా దానికదే పేరు క్రియేట్‌ అవుతుంది. దానిని మీకు కావాల్సినట్లుగా మారిస్తే సరిపోతుంది. స్కోరు బోర్డులో టాపర్‌గా నిలిస్తే ఆటోమేటిక్‌గా వారి పేరు పైకి వచ్చేస్తుంది. ఈ స్కోరు కౌంటర్‌ యాప్‌ వర్చువల్  డైస్‌ రోల్‌తో వస్తుంది. స్క్రీన్‌ను నొక్కడం, కదిలించడం ద్వారా ప్రారంభించవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


స్కోరింగ్‌ యాప్‌లకు విభిన్నంగా...

స్కోరింగ్‌ యాప్‌లకు భిన్నంగా స్కోర్ ఇట్‌ (Score it) యాప్‌ ఉంటుంది. స్ప్రెడ్‌షీట్‌లాగా పాయింట్ల టేబుల్‌ ఫార్మాట్‌ రూపొందించారు. బిల్ట్‌ ఇన్‌ సపోర్ట్‌తో కార్డు గేమ్స్‌కు ఉపయోగపడుతుంది. యూనివర్సల్‌ స్కోర్ కీపర్‌గా ఇతర ఆటలకు కూడా స్కోర్ ఇట్‌ పనికొస్తుంది. రౌండ్ల పద్ధతిలో స్కోరు నమోదు చేసుకోవచ్చు. ప్రతిసారి ప్లస్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే రౌండ్‌ రౌండ్‌కు స్కోరును యాడ్‌ చేయవచ్చు. ఏ సమయంలోనైనా ఆటగాళ్ల స్కోరు మొత్తం వివరాలను, ప్రదర్శనను గ్రాఫ్‌ రూపంలోనూ చూసే వెసులుబాటు ఉంది.యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


థింగ్‌ కౌంటర్‌

అన్ని లెక్కింపు అవసరాలకు థింగ్‌ కౌంటర్‌ (Thing Counter) సరిపోతుందనే చెప్పొచ్చు. పేరు అలా ఉన్నప్పటికీ స్కోరు కీపింగ్‌ యాప్స్‌ కంటే భిన్నమైన, ఆసక్తికరమైన లక్షణాలు ఇందులో ఉన్నాయి. ట్రాకింగ్‌ పాయింట్‌ టాలీలతో ప్రతి వివరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంది. చివరిసారిగా అప్‌డేట్‌ ఎప్పుడు అయింది.. ఎంత సమయం గడిచిందో తదితర అంశాల సమాచారాన్ని ఆటోమేటిక్‌గా నమోదు చేస్తుంది. బిల్ట్‌ ఇన్ టెక్ట్స్‌ టు స్పీచ్‌ సాఫ్ట్‌వేర్‌తో ప్లేయర్‌ పేరును, ప్రస్తుతం స్కోరు మొత్తం లాంటి వివరాలు వెల్లడిస్తుంది. స్క్రీన్‌ను చూడకుండానే ఫోన్‌ వ్యాల్యూమ్‌ బటన్లను ఉపయోగించి స్కోరు కౌంటర్‌కు జోడించవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


జాబితా నుంచి ఎంచుకోవచ్చు.. 

స్కోరు కీపింగ్‌ యాప్‌ల్లో అల్టిమేట్‌ స్కోర్ గేమ్స్‌ (Ultimate Score Games) యాప్‌ లెక్కే వేరు. ఈ యాప్‌ నిర్దిష్ట గేమ్స్‌ కోసం రూపొందించబడింది. జాబితా నుంచి కావాల్సిన దాన్ని ఎంచుకోవడానికి యాప్‌ పర్మిషన్‌ ఇస్తుంది. డైస్‌ గేములు, కార్డు, బోర్డు ఆటలకు ఎంతో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన ఆటలను గుర్తించడం, కౌంటర్లలో ప్రతి దానికి సొంతంగా సెట్టింగ్స్‌ ఉన్నాయి. నియమ నిబంధనలతో ఆడాలనుకుంటే ఈ యాప్‌ బాగుంటుంది. ఆటల ఫలితాలను లైన్‌ గ్రాఫ్‌ల రూపంలో కనిపిస్తాయి. గూగుల్‌ ఖాతా నుంచి కానీ ఓ ఫోల్డర్‌ నుంచి డేటాబేస్‌లను తీసుకోవచ్చు, పంపించుకోవచ్చు. ఉచితంగా దొరికే వెర్షన్స్‌లో కౌంటర్ల సంఖ్య పరిమితం.. అలాగే కొన్ని ఫీచర్స్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


స్కోరును షేర్‌ చేసుకోవచ్చు.. 

క్రీడాభిమానులకు వర్చువల్‌ స్కోర్‌ బోర్డ్‌ (Virtual Scoreboard)భలేగా ఉంటుంది. వివిధ రకాల ఆటలకు సంబంధించి పాయింట్ల పట్టికలు రూపొందించారు. కార్డు గేములు ట్రుకో, చెస్, రూబిక్‌ క్యూబ్‌ ఆటలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి ఏదైనా గేమ్‌ను ఎంచుకుంటే వర్చువల్‌ స్కోర్ బోర్డ్‌ ఓపెన్‌ అవుతుంది. గడియారం, తప్పులను చూపించే బటన్స్‌, వివిధ పాయింట్లను కేటాయిస్తూ ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. స్కోర్‌ బోర్డును ఇతరులకు షేర్‌ చేసే అవకాశం ఉంది. యాప్‌ పర్చేజ్‌లో యాడ్‌లు లేకుండా కౌంటర్‌ను పొందవచ్చు. అదే ఫ్రీ వెర్షన్‌లో వీడియో యాడ్‌లు వస్తుంటాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


థింగ్‌ కౌంటర్‌లా.. మరొక యాప్‌

థింగ్‌ కౌంటర్‌ యాప్‌ మాదిరిగానే కౌంటర్‌ (Counter)లోనూ స్కోరింగ్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. వ్యక్తిగత కౌంటర్లకు ట్యాగ్‌లను యాడ్‌ చేసుకోవచ్చు. అలాగే ట్యాగ్‌ కేటాయించిన కౌంటర్లను మాత్రమే చూపించడానికి సైడ్‌ మెనూ నుంచి ఎంచుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, విభిన్న ఆటల కోసం కౌంటర్ల సెట్‌లను సృష్టించడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఫ్రీ వెర్షన్‌లో కౌంటర్‌ యాప్‌నకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అన్‌లాక్‌ చేయాల్సిన వాటిని యాప్‌ పర్చేజ్‌లో కొనుగోలు చేసుకోవాల్సిందే. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న