మైక్రోమ్యాక్స్‌: కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదల
close

Published : 03/11/2020 23:54 IST
మైక్రోమ్యాక్స్‌: కొత్త స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదల

నవంబర్‌ 24 నుంచి ఆన్‌లైన్‌లో విక్రయం

ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైనట్లు వెల్లడించిన మైక్రోమ్యాక్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న IN సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్లను మైక్రో మ్యాక్స్‌ ఎట్టకేలకు విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్‌ IN నోట్‌ 1, IN 1b స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులకు నవంబర్ 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. మైక్రోమ్యాక్స్‌ నోట్ 1 ధర రూ.10,999 నుంచి ప్రారంభం కానుండగా.. నోట్‌ 1b స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7,999 నుంచి మొదలవుతుందని సంస్థ వెల్లడించింది. నోట్‌ 1 ఫ్లిప్‌కార్ట్‌, మైక్రోమ్యాక్స్‌ అధికారిక వెబ్‌సైట్లలో నవంబర్‌ 24 నుంచి , నోట్‌ 1b స్మార్ట్‌ఫోన్లను నవంబర్‌ 26వ తేదీ నుంచి విక్రయించనున్నట్లు తెలిపింది. ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించినట్లు మైక్రోమ్యాక్స్‌ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోకో సీ 3, రెడ్‌మి 9ఏ, రియల్‌మి సీ12కు పోటీగా తమ కొత్త ఉత్పత్తులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. 

In నోట్ 1 స్పెషిఫికేషన్స్‌,  ఫీచర్స్‌

* 6.67 అంగుళాల హెచ్‌డీ+ తెర
* 5000mAh బ్యాటరీ, 18 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
* Media tek Helio G85 SoCతో పని చేస్తుంది. 
* 4GB RAMతో 64GB, 128GB స్టోరేజీ కెపాసిటీ
*  ‘స్టాక్‌’ ఆండ్రాయిడ్‌
* 48 MP + 5 MP + 2 MP + 2 MP రేర్‌ కెమెరా సెటప్‌
*  నో బ్లోట్‌ వేర్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌కు సంబంధించి రెండేళ్ల గ్యారంటీ
* 4 GB+64GB అయితే రూ.10,999
* 4 GB+128GB అయితే రూ.12,499లలో లభిస్తుంది. 

In నోట్‌ 1b ఫీచర్స్‌

* మీడియా టెక్‌ హెలియో G35 SoC
* 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజీ; ధర- రూ.6,999
* 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ; ధర- రూ.7,999
* 13 ఎంపీ డ్యూల్‌ రేర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
*  యూఎస్‌బీ-సీ పోర్ట్‌
* 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
* 5000mAh బ్యాటరీ, రివర్సింగ్‌ ఛార్జింగ్‌
* మూడు రంగుల్లో లభిస్తుంది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న