GOOGLE MAPS: కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది..
close

Updated : 02/12/2020 17:25 IST
GOOGLE MAPS: కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది..

మీ స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించారు. ఠక్కున అవతలి వ్యక్తి అడిగే ప్రశ్న.. వాట్సాప్‌లో లోకేషన్‌ షేర్‌ చేయవోయ్‌.
నగరంలోని ఓ ప్రదేశానికి వెళ్లాలి. వెంటనే స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ మ్యాప్స్‌ను ఓపెన్‌ చేసేస్తాం. 
గమ్య స్థానానికి చేరుకోవడంలో గూగుల్‌ మ్యాప్స్‌ ఎంతో సాయపడుతోంది. మరి అలాంటి గూగుల్‌ మ్యాప్స్‌కు కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. అదనంగా ‘ఎక్స్‌ప్లోర్’ ట్యాబ్‌ను గూగుల్‌ జోడించింది. ప్రపంచ్యవాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు కొత్తగా కమ్యూనిటీ ఫీడ్‌ సదుపాయాన్ని కల్పించినట్లు గూగుల్‌ వెల్లడించింది. ‘ఎక్స్‌ప్లోర్‌ ట్యాబ్‌’లో మీరు అనుసరించే వ్యక్తులు, వ్యాపారాలు, సమీప ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కార్యక్రమాలు పోస్టు చేస్తే ఏమిటనేవి తెలుస్తాయి. ఆహారం, పానీయాలు, ఆర్టికల్స్‌ను ఎవరైనా పోస్ట్‌ చేస్తే దాని కంటెంట్‌ తెలుసుకోనే వీలు కలుగుతుంది. ఆ పోస్టులు, వ్యక్తులు, వ్యాపారాలను యూజర్లు ఇష్టపడితే సందర్శించవచ్చు. సమీప ప్రాంతాల సమాచారం, వెళ్లవలసిన ప్రదేశాల గురించి గూగుల్‌ మ్యాప్స్‌ సిఫార్సు చేస్తుంది. సమాచారమంతా గూగుల్‌ దాదాపు 20 మిలియన్ల కంట్రిబ్యూషన్స్‌ నుంచి సేకరించింది. నచ్చిన ప్రదేశం, వ్యాపారానికి సంబంధించిన అప్‌డేట్లు, తాజా సమీక్షలు, రేటింగ్, ఫొటోలు, యూజర్ల ప్రశ్నలకు సమాధానం, చిరునామాలు వంటివి చాలా అంశాలను గూగుల్‌ జోడించింది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్స్‌ ఏంటంటే..?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న