టెక్‌తో కరోనాకి చెక్‌..!
close

Updated : 09/10/2020 21:18 IST
టెక్‌తో కరోనాకి చెక్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రాకతో ఏది తాకాలన్నా భయమే. ఏది తినాలన్నా బెరుకే. అంతలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోందీ వైరస్‌. కానీ మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల వైరస్‌ను మన దరికి చేరనీయకుండా జాగ్రత్త పడొచ్చు. వీటితో పాటు కరోనా నుంచి రక్షించుకునేందుకు కొన్ని టెక్‌ గ్యాడ్జెట్‌లు అందుబాటులోకొచ్చాయి. వాటిపై ఓ లుక్కేయండి.. 


చేతితో తాకకుండానే ..

ఇప్పుడు ఇంటి తలుపు తెరవాలన్నా.. లిఫ్ట్‌ బటన్‌ నొక్కాలన్నా.. ఏటీఎంలో డబ్బు తీయాలన్నా.. చేతితో దేన్ని తాకాలన్నా భయమే. మరెలా? ఈ గ్యాడ్జెట్‌ పేరు CleanTouch‌. దీంతో మీరు టచ్‌ చేయకుండానే పని పూర్తి చేయొచ్చు. ఇంటి తలుపులు తెరవొచ్చు. ఏటీఎం బటన్‌ నొక్కొచ్చు. బాక్స్‌ ఓపెన్‌ చేయొచ్చు. దీన్ని వైరస్‌లను ఆపడానికి యాంటిమైక్రోబయల్‌ ఇత్తడితో తయారుచేశారు.


కూరగాయలు, పండ్లను..

మార్కెట్‌కెళ్లి కూరగాయలు, పండ్లు తెచ్చి కడిగాక అరగంట బయటే ఉంచుతాం. వండే ముందు వేడి నీటితో శుభ్రం చేస్తాం. మరి ఇంత శ్రమ అక్కర్లేకుండా నిమిషాల్లో కూరగాయల్ని వైరస్‌ రహితం చేసే పరికరం ఉంటే? అలాంటిదే ఇది. పేరు KENT Table Top Vegetable & Fruit Disinfectant. ఇందులోని కెమికల్‌-ఫ్రీ ఓజోన్‌ టెక్నాలజీతో వైరస్‌, బ్యాక్టీరియాలను సులభంగా తొలగించొచ్చు. 


స్మార్ట్‌ఫోన్‌ సంగతి

మన స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నో రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఉంటాయని మనందరికీ తెలుసు. మరి నిరంతరం మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రం చేస్తున్నామా? మీకా శ్రమ లేకుండా సింపుల్‌గా శుభ్రం చేసే ఓ గ్యాడ్జెట్‌ ఉంటే..? దానిపేరే Portable Multi-Functional UV Sterilizer & Wireless Charger. ఇది యూవీ స్టెరిలైజర్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌ కూడా. సింపుల్‌గా మీ ఫోన్‌ని దీనిపై ఉంచితే చాలు వైరస్‌లను చంపి, ఛార్జ్‌ చేస్తుంది. 


నీటిని తాగాలంటే..

నీటిని బాటిల్‌లో ఉంచుకుంటాం. ఆఫీస్‌కి వెళ్లేప్పుడు బాటిల్‌ తీసుకెళ్తాం. తొందర్లో కడగడం మర్చిపోతాం. అయినా ప్రతి రోజూ కడగాలంటే కాస్త ఇబ్బందే. అందుకే ఆ పనిని బాటిల్‌కే అప్పచెప్పేయండి. అలాంటిదే ఈ బాటిల్‌ పేరు Sipper Water Bottle with UV Coating. ఇందులో యూవీ-సీ లైట్‌ అమర్చడం వల్ల దానికదే శుభ్రం చేసుకుంటుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాను క్షణాల్లో సంహరిస్తుంది.


ఇంటి శుభ్రత

రోజూ ఎక్కడొక్కడో తిరిగి ఇంటికి చేరుతాం. మనతో ఉన్న వస్తువులను శుభ్రం చేస్తాం. మరి ఇంటి ఫ్లోర్‌ పరిస్థితి. రోజూ శుభ్రం చేయాలంటే కాస్త కష్టమే. అందుకే సింపుల్‌గా ఈ గ్యాడ్జెట్‌ ఇంటికి తెచ్చేయండి. పేరు ఎంఐ రోబోట్‌ వ్యాక్యూమ్‌. ఒక్క క్లిక్‌తో ఇంటిని శుభ్రం చేసేయొచ్చు. అందుకు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంఐ హోమ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు.


ముఖాన్ని తాకకుండా..

మనం రోజులో మనకు తెలీకుండానే అనేక సార్లు మన ముఖాన్ని తాకుతుంటాం. దీనివల్ల మన చేతికి ఉన్న వైరస్‌, బ్యాక్టిరియా నోరు, ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించొచ్చు. మరి మీ చేయి మీ ముఖానికి తగలకుండా గుర్తుచేసే పరికరం ఉంటే..? అలాంటిదే ఈ బ్రాస్‌లెట్‌. పేరు "Immutouch" Vibrating Bracelet. ముఖానికి దగ్గరగా మీ చేయి వెళితే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తూ వైబ్రేషన్‌ ఇస్తుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా పని చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న