యాపిల్‌ కొత్త బటన్‌.. వెతికితే కనిపించదు!
close

Published : 01/11/2020 22:23 IST
యాపిల్‌ కొత్త బటన్‌.. వెతికితే కనిపించదు!

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్‌ సంస్థ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఐవోఎస్‌ 14 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌తో పాటు హార్డ్‌వేర్‌ ఆప్‌డేట్‌నూ ఇచ్చింది. మరి ఆ బటన్‌ ఎక్కడుందో మీ ఐఫోన్‌ను తనిఖీ చేస్తున్నారా..? అయితే దాన్ని మీరు కనిపెట్టలేరు. ఎందుకంటే అది కంటికి కనిపించని హార్డ్‌వేర్‌ బటన్‌. ఐఫోన్‌ వెనుక ప్యానెల్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఈ బటన్‌ను ఉపయోగించొచ్చు. ఇంతకీ దీన్ని ఎలా ఆన్‌ చేయాలి? ఉపయోగాలేంటి?

* మీ ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్లి ‘టచ్‌’ ఓపెన్‌ చేయండి. అలానే కిందకు స్క్రోల్‌ చేస్తూ ఉంటే బ్యాక్‌ ట్యాప్‌ ఆప్షన్‌ను కనిపిస్తుంది. దానిని ఆన్‌ చేయాలి. 
* బ్యాక్‌ ట్యాప్‌ ఆప్షన్‌ను ఎంచుకోగానే ప్రత్యేకంగా స్క్రీన్‌ ఓపెన్‌ అయి డబుల్ ట్యాప్‌, ట్రిపుల్‌ ట్యాప్‌ అని రెండు ఎంపికలు వస్తాయి. 
* మీరు వాటిలో దేనినైనా ఎంచుకున్నప్పుడు, మీ ఫోన్ వెనుక ప్యానెల్‌ను ట్యాప్‌ చేయడం ద్వారా మీరు చేయగలిగే పనుల జాబితా వస్తుంది. 
* లాక్‌ స్క్రీన్‌, స్క్రీన్‌షాట్‌ వంటివి డబుల్‌ లేదా ట్రిపుల్‌ ట్యాప్‌ చేయడం ద్వారా పొందొచ్చు. బ్యాక్‌ ప్యానెల్‌లో  ఫలానా చోట ట్యాప్‌ చేయాలనేం లేదు. ఎక్కడ ట్యాప్‌ చేసినా ఈ బటన్‌ పనిచేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న