వ్లాగ్‌.. వాహ్‌ అనిపించాలా!!
close

Updated : 16/10/2020 15:34 IST
వ్లాగ్‌.. వాహ్‌ అనిపించాలా!!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాగ్లింగ్‌.. ఇప్పుడు యూట్యూబ్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్న పేరు. సెలబ్రెటీల నుంచి సాధారణ యువత వరకు వాగర్స్‌గా మారిపోతున్నారు. నచ్చిన అంశాలతో వ్లాగింగ్‌ ఛానల్‌ పెట్టేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా కొందరు డీఎస్‌ఎల్‌ఆర్‌లను ప్రయత్నిస్తుంటే.. మరికొందరు వారివారి స్మార్ట్‌ఫోన్‌తోనే సిద్ధం చేసేస్తున్నారు. మరి మీరూ వ్లాగర్‌గా మారాలనుకుంటున్నారా! ధర కాస్త ఎక్కువైనా సరే అదిరే వీడియోల్ని తీసే స్మార్ట్‌ఫోన్‌ ప్రయత్నిద్దామనుకుంటున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి. వ్లాగింగ్‌కి మాత్రం ప్రత్యేకం.

 

కాస్త ఖరీదైనా..
   కాస్త ఖరీదు ఎక్కువైనా అదిరే క్వాలిటీతో వీడియో షూట్‌ చేయాలంటే ఈ ఫోన్‌ ప్రయత్నించొచ్చు. పేరు ఐఫోన్‌ 11ప్రో మ్యాక్స్‌. వెనుక మూడు(12ఎంపీ+12ఎంపీ+12ఎంపీ), ముందు ఒక కెమెరా(12ఎంపీ)తో నాణ్యమైన వీడియోలు తీయొచ్చు. వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లోనూ, రాత్రి సమయాల్లో దానికదే నైట్‌మోడ్‌లో సెట్‌ చేసుకుంటుంది. స్మార్ట్‌ హెచ్‌డీఆర్‌తో మంచి హైలైట్స్‌, షాడోస్‌, ఫేస్‌స్కిన్‌టోన్స్‌తో 4కే వీడియోలను సృష్టించొచ్చు. ఇక దీనికి మరో ప్రత్యేకత ఉందండోయ్‌.. మీరు కెమెరాని జూమ్‌ చేసి వీడియో తీస్తే ఆడియో సౌండ్‌ కూడా దానికదే జూమ్‌ అవుతుంది. తెర పరిమాణం 6.50అంగుళాలు. రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 
 ధర: రూ.99,100 నుంచి ప్రారంభం


అదిరే కెమెరాతో..
  ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ వీడియోల కోసం ఎక్కువగా వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇది. పేరు సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 అల్ర్టా. కెమెరా విషయానికొస్తే అత్యధిక మెగా పిక్సల్‌ గల నాలుగు వెనక కెమెరాలు(108ఎంపీ+48ఎంపీ+12ఎంపీ+డెప్త్‌)తో పాటు 40ఎంపీ సెల్ఫీ కెమెరాతో అదిరే 8కె, 4కె వీడియోలు తీయొచ్చు. 100ఎక్స్‌ స్పేస్‌ జూమ్‌, 5జీ, 12జీబీ ర్యామ్‌ దీని ప్రత్యేకతలు. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఎక్కవ సమయం వినియోగించుకోవచ్చు. తెర పరిమాణం 6.90అంగుళాలు. 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉండటం వల్ల స్టోరేజీ సామర్థ్యం అయిపోతుందని భయమే అక్కర్లేదు. కావాల్సిన వీడియోలను ఫోన్‌లోనే భద్రంగా దాచుంచుకోవచ్చు.
 ధర: రూ.97,999

డీఎస్‌ఎల్‌ఆర్‌ వలే..
  రాత్రి షూటింగ్‌ సమయంలో లేదా చీకటి వాతావరణంలో వీడియోలకు ఈ ఫోన్‌ ప్రయత్నించొచ్చు. పేరు హువాయి పి30 ప్రో. బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్‌ చేస్తూ డీఎస్‌ఎల్‌ఆర్‌ వలే మంచి క్లారిటీతో వీడియోలను తీయొచ్చు. వెనక మూడు కెమెరాలు (40ఎంపీ+20ఎంపీ+8ఎంపీ+డెప్త్‌ కెమెరా), 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకట్టుకునే లుక్‌తో ఈ ఫోన్‌ని తీర్చిదిద్దారు. బ్యాలెన్సిడ్‌ కలర్‌తో నాణ్యమైన వీడియోలు తీయొచ్చు. ఫాస్ట్‌ ఛార్జింజ్‌తో పాటు ఎక్కువ కాలం నిలిచే 4200ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, మూడు రకాల జూమ్‌ మోడ్‌లు దీని ప్రత్యేకతలు. తెర పరిమాణం 6.47అంగుళాలు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. 
  ధర: రూ.55,449

 నాణ్యంగా తీర్చిదిద్దండి..
 ఐదు కెమెరాలతో అద్భుతమైన వీడియోలు తీసేయాలంటే ఈ ఫోన్‌ ప్రయత్నించొచ్చు. పేరు ఎంఐ నోట్‌ 10. కదులుతున్న చిత్రాలను కూడా పట్టుకుంటూ 4కె వీడియోలను చిత్రీకరించొచ్చు. కెమెరా విషయానికొస్తే వెనక ఐదు కెమెరాలు (108ఎంపీ+12ఎంపీ+5ఎంపీ+20ఎంపీ+2ఎంపీ).. సెల్ఫీ వ్లాగ్‌లను సైతం నాణ్యంగా తీర్చిదిద్దేలా 32ఎంపీ ముందు కెమెరా అందుబాటులో ఉంది. వ్లాగ్‌ మోడ్‌ని సైతం ఎంచుకోవచ్చు.  వీడియో స్టెబిలైజేషన్‌ ఈ కెమెరా ప్రత్యేకత. కాస్త తక్కువ ధరలో మంచి వ్లాగింగ్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఎంచుకోవచ్చు.  తెర పరిమాణం 6.47అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 5260ఎంఏహెచ్‌. త్వరలోనే రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.
 అంఛనా ధర: రూ.43,200

ప్రత్యేక ఫీచర్లతో‌..
  మీ వ్లాగ్‌ వీడియోను అందంగా తీర్చిదిద్దాలనుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రయత్నించొచ్చు. పేరు గూగుల్‌ పిక్సల్‌ 4ఎక్స్‌ఎల్‌..క్లాసిక్‌ లుక్‌తో, డైనమిక్‌ రేంజ్‌, మంచి కలర్‌లో మీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.రెండు వెనక కెమెరాలు(16ఎంపీ+12.2ఎంపీ)తో పాటు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో అదిరే 4కె వీడియోలు తీయొచ్చు. ఈ ఫోన్‌ మరో ప్రత్యేకత ఏంటంటే ‘ఆస్ట్రోఫొటోగ్రఫీ మోడ్‌’ దీంతో ఆకాశంతో పాటు ఆకాశంలోని నక్షత్రాలను షూట్‌ చేయొచ్చు. మంచి ‌రికార్డింగ్‌, జూమ్‌, ఆపరేటింగ్ సిస్టమ్‌ సౌకర్యాలున్నాయి. బ్యాటరీ సామర్థ్యం 3700ఎంఏహెచ్‌. తెర పరిమాణం 6.3అంగుళాలు. రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 
  ధర: రూ.94,500


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న