Clubhouse: సంగీతకారుల కోసం క్లబ్‌హౌస్‌ మ్యూజిక్ మోడ్‌
close

Published : 16/10/2021 22:06 IST

Clubhouse: సంగీతకారుల కోసం క్లబ్‌హౌస్‌ మ్యూజిక్ మోడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆడియో సోషల్‌ మీడియా యాప్‌ క్లబ్‌హౌస్‌ సంగీతకారుల కోసం ‘మ్యూజిక్ మోడ్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇది మ్యూజీషియన్స్‌ మరింత మెరుగ్గా ప్రదర్శన ఇచ్చేందుకు సాయపడుతుందని క్లబ్‌హౌస్ తెలిపింది. ఇందులోని ప్రత్యేకమైన టూల్స్‌ సౌండ్‌ని అంచనా వేసి ఉత్తమమైన అవుట్‌పుట్‌, హైక్వాలిటీ స్టీరియో సౌండ్‌ను ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్‌ ద్వారా ప్రదర్శన ఇచ్చేటప్పుడు యూఎస్‌బీ మైక్రోఫోన్స్, మిక్సింగ్ బోర్డ్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ముందుగా ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు క్లబ్‌హౌస్‌ తెలిపింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్‌కి కూడా అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. 

మ్యూజిక్ మోడ్‌ని ఎనేబుల్ చేసుకునేందుకు ముందుగా క్లబ్‌హౌస్‌లో రూమ్‌ ప్రారంభించాలి. తర్వాత రూమ్‌ పైభాగంలో కుడివైపున ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే ఆడియో క్వాలిటీ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మ్యూజిక్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌ మీద మీకు ప్రత్యేకమైన టూల్స్‌ కనిపిస్తాయి. అందులో మీకు అవసరమైన టూల్స్‌ని ఉపయోగించి మ్యూజిక్‌ మోడ్‌ని ఉపయోగించుకోవచ్చు. అలానే క్లబ్‌హౌస్‌ సెర్చ్‌బార్ ఫీచర్‌లో కొన్ని మార్పులు చేసింది. దీంతో యూజర్స్‌ తమకు అసరమైన రూమ్‌తోపాటు, స్నేహితులను సులువుగా గుర్తించవచ్చు. క్లబ్‌హౌస్‌ని యూజర్స్‌ మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం ఇన్వైట్ రిక్వెస్ట్‌ ఫీచర్‌ని తొలగించింది. అలానే స్పేషియల్ ఆడియో పేరుతో కొత్త ఫీచర్‌ని పరిచయం చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా యూజర్స్‌ లైవ్‌ ఆడియో అనుభూతిని పొందటమే కాకుండా..వారి మాటలు శ్రోతలకు 3డీలో  వినిపిస్తాయని వెల్లడించింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న