E-Mail Scam: జీమెయిల్‌, అవుట్‌లుక్ యూజర్స్ పారాహుషార్‌! 
close

Published : 11/10/2021 19:27 IST

E-Mail Scam: జీమెయిల్‌, అవుట్‌లుక్ యూజర్స్ పారాహుషార్‌! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ-మెయిల్ ద్వారా జరిగే మోసాలు కొత్తేమీ కాదు. వాటి గురించి మనం తరచుగా వార్తలో వింటూనే ఉంటాం. అయితే ప్రభుత్వాలు, సైబర్ నిపుణులు ఈ మోసాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల ద్వారా యూజర్స్‌కి వల విసురుతున్నారు. తాజాగా జీమెయిల్, అవుట్‌లుక్ మెయిల్ ఖాతాదారులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఇందులో భాగంగా సైబర్‌ నేరగాళ్లు యూజర్ మెయిల్‌కి సూపర్‌ మార్కెట్ గిఫ్ట్‌కార్డ్‌ పేరుతో మెయిల్ పంపుతారు. దానిపై ఎలాంటి అనుమానం రాకుండా అధికారిక లొగోను ఉపయోగిస్తారు. యూజర్‌ దానిపై క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించిన లాగిన్‌ వివరాలు హ్యాకర్స్‌కి చేరిపోతాయి. వాటితో సైబర్ నేరగాళ్లు యూజర్స్ బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు ఖాళీ చేస్తున్నట్లు గుర్తించామని బ్రిటన్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి మోసపూరిత మెయిల్స్‌ను గుర్తించి, వాటికి దూరంగా ఉండేందుకు సైబర్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం. 

యూజర్‌ ఏం చేయకూడదంటే? 

* తెలియని వ్యక్తులు లేదా అనుమానిత సంస్థలు, ఆఫర్ల పేరుతో వచ్చే ఈ-మెయిల్స్‌ని క్లిక్ చేయకూడని తెలిపారు. 

* ఒకవేళ పొరపాటున అనుమానిత మెయిల్ ఓపెన్ చేసినా వాటిలో ఉండే ఫొటోలు, అటాచ్‌మెంట్‌ ఫైల్స్‌పై క్లిక్‌ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

* అలానే అధీకృతం కానీ, తెలియని వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత సమాచారంతోపాటు, ఈ-మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటి వివరాలు నమోదు చేయవద్దని సూచించారు. 

* ఆన్‌లైన్‌ సర్వేలు, ఆఫర్ల పేరుతో వచ్చే ఈ-మెయిల్స్‌ని ఓపెన్ చేయకపోవడం ఉత్తమని వెల్లడించారు. 

మోసపూరిత మెయిల్స్‌ గుర్తించడమెలా?

మీకు మెయిల్‌కి ఆఫర్లు, ఇతరత్రా ఆకర్షణీయమైన ప్రకటనలు పేరుతో వచ్చే ఈ-మెయిల్స్‌లో అక్షర దోషాలు, గ్రామర్‌ తప్పులు వంటివి ఉంటే అలాంటి వాటిపై క్లిక్ చేయకండి. అవి మోసపూరిత మెయిల్స్ కావచ్చు. వాటిని మార్క్‌ చేసి స్పామ్‌ మెయిల్‌ కింద రిపోర్ట్ చేయండి. అలానే వాటిని మీ మెయిల్‌ బాక్స్ నుంచి తొలగించమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న