ఆడుకోండి హాయిగా.. గూగుల్‌ డూడుల్‌ గేమ్స్‌
close

Updated : 10/02/2021 13:54 IST
ఆడుకోండి హాయిగా.. గూగుల్‌ డూడుల్‌ గేమ్స్‌

ఎప్పుడైనా బోర్‌ అనిపిస్తే చాలు. ఫోన్‌లో గేమింగ్‌ యాప్స్‌పై వాలిపోతుంటాం. బాగా తీరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది కుదురుతుంది. వర్క్‌ మధ్యలోనో.. ఆన్‌లైన్‌ క్లాస్‌ బ్రేక్‌లోనో.. కొన్ని నిమిషాల పాటు రీఫ్రెష్‌ అయ్యేందుకు గేమ్‌ ఆడదాం అనుకుంటే? అదీ పీసీలో.. అప్పుడెలా? చాలా సింపుల్‌ గూగుల్‌ డూడుల్‌ గేమ్స్‌ ఆడేయండి. ఇవిగోండి కొన్ని..

ముందు క్రికెట్‌ ఆడదాం అనుకుంటే.. 

స్టేడియంలో నత్తలు ఫీల్డింగ్‌ చేస్తుంటే.. చీమలు బ్యాటింగ్‌కి దిగుతాయి. చీమల తరఫున మీరు బ్యాటింగ్‌ చేయాలి. షార్ట్‌లు కొట్టడం చాలా సింపుల్‌. జెస్ట్‌ మౌస్‌తో క్లిక్‌ చేస్తే చాలు. సింగిల్స్‌తో పాటు.. ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టొచ్చు. బౌలింగ్‌ నత్త నడకన ఉంటుదిలే అనుకుంటే వికెట్‌ కోల్పోయినట్టే. ఇన్‌స్వింగ్‌లు.. అవుట్‌ స్వింగ్‌లు.. బౌలింగ్‌ వైవిధ్యంగా సాగుతుంది. ఆలస్యం చేయకుండా బ్యాటింగ్‌ మొదలెట్టేయండి. * వెబ్‌ లింక్‌: http://bit.ly/2MorCBl


గోల్‌ పడనివ్వొద్దు...

కాసేపు ఫుల్‌బాల్‌ ప్లేయర్‌గా మారిపోదాం అనిపిస్తే.. వెంటనే సాకర్‌ వీరులైపోండి. చాలా సింపుల్‌. మీరు గోల్‌ కీపర్‌ అన్నమాట. ఎదురుగా ఐదు కిక్‌లతో బంతులు మీపైకి దూసుకొస్తాయ్‌. వాటిని మీరు అడ్డుకోవాలి. కీబోర్డు కంట్రోల్స్‌తోనే ఆడేయొచ్చు. యారో మీటలు, స్పేస్‌బార్‌.. వీటిని వాడితే చాలు. గోల్‌ కీపర్‌లా రంగంలోకి దిగండిక! * వెబ్‌ లింక్‌: http://bit.ly/3jgfGNL


బుర్రకు పదును... రూబిక్స్‌ క్యూబ్‌

చిన్నప్పుడో.. వయసొచ్చాకో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా రూబిక్‌ క్యూబ్‌ని ప్రయత్నించే ఉంటారు అందరూ. ఇప్పుడు ఉన్న బిజీ బిజీ లైఫ్‌ స్టైల్‌లో క్యూబ్‌ని మిస్‌ అవుతున్నామనే ఆలోచన వస్తే... వెంటనే ఆడేయండి. మౌస్‌తో చక చకా తిప్పుతూ ఆడేయొచ్చు. చేతులతో పట్టుకుని ఆడుతున్నట్టే అనిపిస్తుంది. ఎంత త్వరగా సాల్వ్‌ చేస్తారనేది మీ స్కిల్‌ని బట్టి ఉంటుంది. ఒకసారి మళ్లీ ప్రయత్నించండి. * వెబ్‌ లింక్‌: https://bit.ly/3pJauo6


విసిరి చూడండి

టైమ్‌పాస్‌కి ఇంటి బాల్కనీలో.. గార్డెన్‌లో.. ఎక్కడైనా కొంచెం ఖాళీ ఉంటే చాలు. ఒక్కరే ఆడుకునే ఆట బాస్కెట్‌ బాల్‌. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్‌ అయ్యేందుకు పీసీలోనూ ఈ డూడుల్‌ గేమ్‌ ఆడొచ్చు. మౌస్, స్పేస్‌బార్‌ని వాడుకుని నెట్‌లోకి గోల్‌ వేయొచ్చు. మొదట్లో గోల్‌కి దగ్గరగా ఉండి వేయొచ్చు. తర్వాత దూరం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న దూరం ఆధారంగా ఎంత వేగంతో బాల్‌ని విసరాలో తెలిస్తే చాలు. పాయింట్స్‌ అన్ని మీవే! * వెబ్‌ లింక్‌: http://bit.ly/3ayQVs9


సెయిలర్‌గా మారిపోండి

ఎప్పుడైనా పడవ నడిపారా? అయితే, పొడవైన కాలువలో సన్నని పడవపై పోటీ పడండి. కీబోర్డులోని బాణం మీటల్ని వాడుకుని తెడ్డుని అటు ఇటు ఆడిస్తూ ముందుకు సాగొచ్చు. మధ్యలో ఎదురయ్యే అవాంతరాల్ని తప్పించుకుని ముందుకు సాగాలి. అప్పుడే త్వరగా ప్రయాణం సాగుతుంది. గమ్యానికి చేరొచ్చు. ఎంత సమయంలో గమ్యాన్ని చేరుకున్నారో చూపిస్తుంది. అదే మీ స్కోర్‌ అన్నమాట. * వెబ్‌ లింక్‌: http://bit.ly/2MXP88c


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న