Instagram: ఇన్‌స్టా యూజర్స్‌కు గమనిక.. పుట్టిన తేదీ చెప్పకుంటే సేవలు బంద్‌!
close

Published : 31/08/2021 23:10 IST
Instagram: ఇన్‌స్టా యూజర్స్‌కు గమనిక.. పుట్టిన తేదీ చెప్పకుంటే సేవలు బంద్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌కి ఫేస్‌బుక్ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టా యూజర్స్‌ అందరూ తమ పుట్టిన తేదీని తప్పక ధ్రువీకరించాలని తెలిపింది. భద్రతకు సంబంధించిన కొత్త నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం 13 ఏళ్ల వయసులోపు వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త వెర్షన్ యాప్‌ రూపొందిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. దీనిపై పలువురు న్యాయనిపుణులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించడంపై సదరు సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించడంలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘ ప్రతి ఇన్‌స్టా యూజర్‌ తమ పుట్టిన తేదీని ధ్రువీకరించాలి. దానివల్ల మేం ఆయా వయస్సుల వారికి అందుకనుగుణంగా సేవలను అందించగలుగుతాం’’ అని తన బ్లాగ్‌లో పేర్కొంది.

అలాగే, 16 ఏళ్లు దాటిన వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రయివేటు ఖాతా తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. అందుకనుగుణంగా యూజర్స్ ఇన్‌స్టాలో ఖాతా తెరిచేటప్పుడు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీని సమర్పించాలని కోరింది. ఒకవేళ యూజర్‌ పుట్టిన తేదీని ధ్రువీకరించకుంటే పాప్‌-నోటిఫికేషన్‌ ద్వారా సదరు యూజర్‌కి గుర్తు చేస్తుంటామని.. చివరిగా ఇన్‌స్టా యాప్‌ సేవలు నిలిపివేస్తామని ఫేస్‌బుక్ తెలిపింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పుట్టిన తేదీ నమోదు చేసిన యూజర్స్‌కి ఈ నిబంధన వర్తించదని స్పష్టంచేసింది. యూజర్స్ తప్పుడు పుట్టిన తేదీలను నమోదు చేసినా గుర్తించే విధంగా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న