Facebook: మరింత పారదర్శకంగా ఫేస్‌బుక్ డేటా ట్రాన్స్‌ఫర్ 
close

Published : 10/08/2021 23:40 IST
Facebook: మరింత పారదర్శకంగా ఫేస్‌బుక్ డేటా ట్రాన్స్‌ఫర్ 

ఇంటర్నెట్‌డెస్క్: యూజర్‌కి మెరుగైన సేవలందించడంలో భాగంగా ట్రాన్స్‌ఫర్‌ యువర్ ఇన్ఫర్మేషన్ (టీవైఐ) ఫీచర్‌ని ఫేస్‌బుక్ అప్‌డేట్ చేసింది. దాంతోపాటుగా ఫేస్‌బుక్‌లోని సమాచారాన్ని ఫొటో బకెట్‌, గూగుల్ క్యాలెండర్‌లోకి బదిలీ చేసుకునే వీలు కల్పించింది. డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాజెక్టులో భాగంగా వీటిని తీసుకొచ్చినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. దీంతో యూజర్స్ డేటా ఎక్కడికి పంపుతున్నారు..బదిలీకి ఎలాంటి డేటా అనుకూలం అనేది కూడా చూడొచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. డేటా బదిలీ చేసే ప్రతిసారీ మరింత పారదర్శకత ఉంటుందని వెల్లడించింది. అలానే ఒకే ఖాతాకు వేర్వేరు చోట్ల నుంచి డేటా బదిలీ చేసేప్పుడు ఏం డేటా పంపాలనేది అందులోని ఫిల్టర్స్ సాయంతో ఎంచుకోవచ్చు.  

గతంలో ఫేస్‌బుక్‌ నుంచి గూగుల్ ఫొటోలకి మాత్రమే ఫొటోలు బదిలీ చేసుకునే వీలుండేది. తాజా అప్‌డేట్‌లో ఫేస్‌బుక్‌ ఈవెంట్స్‌ డేటాను కూడా గూగుల్ క్యాలెండర్‌కు బదిలీ చెయ్యొచ్చు. అలానే డేటా బదిలీ జరుగుతున్నప్పుడు దాని స్టేటస్‌ చూడొచ్చు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విటర్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా యూజర్స్ తమ డేటాను ఇతర ఫ్లాట్‌ఫామ్‌లకు బదిలీ చేసుకునేందుకు అనుమతుస్తున్నాయి. గతంలో అయితే ఒక ఫ్లాట్‌ఫామ్‌ నుంచి మరో చోటుకి డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ముందుగా డౌన్‌లోడ్ చేసుకుని తిరిగి అప్‌లోడ్ చేసుకునేవారు. 2019లో ఈ సమస్యకు పరిష్కారంగా యూజర్స్‌ వేర్వేరు యాప్‌ లేదా సోషల్‌ మీడియా ఖాతాల నుంచి డేటాను ఇతర ఫ్లాట్‌ఫామ్‌లకు బదిలీ చేసుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు వెలుసుబాటు కల్పించాయి. తాజాగా వాటికి మరిన్ని మెరుగులద్ది యూజర్‌ ప్రెండ్లీ ఫీచర్‌గా మారుస్తున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న