జేవియర్‌.. ఓ పోలీసు రోబో
close

Updated : 15/09/2021 01:57 IST
జేవియర్‌.. ఓ పోలీసు రోబో

దేదో చిత్రమైన జీపులా కనిపిస్తోంది కదా. నిజానికిదో రోబో. దీని పేరు జేవియర్‌. ఏదో మామూలు రోబో అనుకుంటున్నారేమో. పోలీసు రోబో. బహిరంగ ప్రాంతాల్లో నిరంతరం గస్తీ కాయటానికి సింగపూర్‌ దీన్ని రూపొందించింది. మాస్కు ధరించకపోయినా, ఉమ్మినా, పొగ తాగినా, నిషిద్ధ ప్రాంతాల్లో వాహనాలు నిలిపినా ఇట్టే పసిగడుతుంది. వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఇటీవలే ఇలాంటి రెండు రోబోలతో అత్యంత రద్దీగా ఉండే చోట ప్రయోగాత్మక ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికివి ప్రజలకు ఎలా నడచుకోవాలో అనేదానిపై అవగాహన కలిగిస్తున్నాయి. మున్ముందు వీటిని చట్టపర చర్యలకూ వినియోగించుకోనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న