ఫొటోలు దాచేయండి!
close

Updated : 07/07/2021 05:24 IST
ఫొటోలు దాచేయండి!

ఫోన్‌లో ఎన్నో ఫొటోలు. డిలిట్‌ చేద్దామంటే మనసొప్పదు. పోనీ గ్యాలరీలో అలాగే ఉంచేద్దామనుకుంటే ఎవరైనా చూస్తారేమోనన్న సందేహం. మరి వీటిని ఇతరుల కంట పడకుండా చేయటమెలా? ఇందుకోసం ఐఫోన్‌లో మంచి ఫీచర్‌ ఉంది. అదే హిడెన్‌ ఆల్బమ్‌. దీనికి థర్డ్‌పార్టీ యాప్స్‌తో అవసరం లేదు. ఇది చాలాకాలంగా అందుబాటులో ఉన్నప్పటికీ ఫొటోస్‌ యాప్‌లో ఆల్బమ్‌ విభాగంలో కనిపిస్తూనే ఉండేది. దీన్ని ఆల్బమ్‌లో కనిపించకుండానూ ఐఓఎస్‌14లో అప్‌డేట్‌ చేశారు. అందువల్ల కనీసం ఐఓఎస్‌14తో నడుస్తున్న ఐఫోన్‌లోనే దీన్ని వాడుకోవటానికి వీలుంటుంది. నిజానికి హిడెన్‌ ఆల్బమ్‌ దానంతటదే ఎనేబుల్‌ అయ్యింటుంది. కానీ కొన్ని పద్ధతులతో దీన్ని మనమే టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటోలు లేదా వీడియోలు కనిపించకుండా చేయాలన్నా వీటినే పాటించాలి.

* ముందుగా ఐఫోన్‌ ఫోటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. దాచేయాలనుకున్న ఫొటో, వీడియోలను ఎంచుకోవాలి. షేర్‌ బటన్‌ను నొక్కి, మెనూలోంచి హైడ్‌ను ఎంచుకోవాలి. దాచేయాలనుకున్న ఫొటో, వీడియోలను కన్‌ఫర్మ్‌ చేసుకొని, సెటింగ్స్‌లోకి వెళ్లి ఫోటోస్‌ బటన్‌ను నొక్కాలి. కిందికి దిగుతూ హిడెన్‌ ఆల్బమ్‌ ఆప్షన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేయాలి. దీంతో ఆల్బమ్‌ అదృశ్యమవుతుంది. తిరిగి ఆన్‌ చేయాలని అనుకుంటే సెటింగ్స్‌లోకి వెళ్లి ఫొటోస్‌ ద్వారానే చేసుకోవాలి.


క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ ఇలా..

పొరపాటున క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ను వెంటనే చూడాలంటే? హిస్టరీలోకి వెళ్లి ఓపెన్‌ చేస్తే సరి. అది నిజమే గానీ దీనికి తేలికైన చిట్కా ఒకటి ఉంది. కంప్యూటర్‌లోనైతే కీబోర్డులో కంట్రోల్‌, షిఫ్ట్‌, టి బటన్లను కలిపి ఒకేసారి నొక్కితే సరి. మ్యాక్‌లోనైతే కమాండ్‌, షిఫ్ట్‌, టి కలిపి నొక్కాలి. వెంటనే చివరిసారి క్లోజ్‌ చేసిన ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న