సినిమా ఆపకుండానే..
close

Published : 22/09/2021 01:13 IST
సినిమా ఆపకుండానే..

నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో సినిమా చూస్తున్నారు. సినిమా మంచి ఉత్కంఠ దశలో ఉంది. అంతలో వేరే యాప్‌తో పని పడింది. సినిమా చూస్తూనే ఇతర యాప్‌ను వాడుకోవటమెలా? ఇందుకోసం పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ను ఎంచుకుంటే సరి. ఒకవైపు సినిమాను చూస్తూనే ఇతర పనులు కానిచ్చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ పరికరాల్లోనైతే సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ ప్రొటెక్షన్‌లోకి వెళ్లి.. స్పెషల్‌ యాప్‌ యాక్సెస్‌ మీద క్లిక్‌ చేసి, పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. అదే ఐఓఎస్‌ పరికరాల్లోనైతే జనరల్‌ సెటింగ్స్‌లోంచే ఈ ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా సినిమా దృశ్యాన్ని రీసైజ్‌ చేసుకోవచ్చు. స్క్రీన్‌ మీద ఎటైనా జరుపుకోవచ్చు. ఫ్లోటింగ్‌ విండోను మినిమైజ్‌ చేసుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న