కొత్త ఎమోజీల సందడి!
close

Published : 22/09/2021 01:15 IST
కొత్త ఎమోజీల సందడి!

ప్పుడంతా అక్షరాలను టైప్‌ చేయకుండా ఒక్క ఎమోజీతోనే లక్ష భావాలను పలికించేస్తున్నారు! అవును. నేటి డిజిటల్‌ యుగంలో భావోద్వేగాలను సూచించే చిత్రాలకు (ఎమోజీ) అంతకంతకీ ప్రాధాన్యం పెరుగుతోంది. రోజువారీ సందేశాల్లో ఇవి విడదీయలేని భాగంగానూ మారిపోయాయి. బాతాఖానీ కోసం కంప్యూటర్లు, ఈమెయిళ్ల కన్నా స్మార్ట్‌ఫోన్లలోని ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లను విరివిగా వినియోగించటమూ దీనికి కొంతవరకు కారణమవుతోంది. ప్రస్తుతం దాదాపు 3,633 అధికారికంగా గుర్తించిన ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. మున్ముందు వీటి సంఖ్య మరింత పెరగనుంది. ఎమోజీ 14.0 అప్‌డేట్‌లో భాగంగా వచ్చే సంవత్సరం మరో 112 ఎమోజీలు అందుబాటులోకి రానున్నాయని యూనికోడ్‌ కన్సార్టియం ప్రకటించింది మరి. కరుగుతున్న ముఖం, నోటికి అడ్డం పెట్టుకున్న చేయి, ఒక కన్నుతో తొంగి చూడటం, సెల్యూట్‌, చుక్కల గీతల ముఖం, వంకర తిరిగిన నోరు, కన్నీళ్లను దాచుకుంటున్న ముఖం, కుడి దిక్కు తిరిగిన చెయ్యి, ఎడమ దిక్కు తిరిగిన చెయ్యి, ఎత్తి చూపే చెయ్యి, వేళ్లతో గుండె ఆకారం, కొరుక్కుంటున్న పెదవి, తలపై కిరీటం, గూడులో గుడ్లు, నీళ్లు ఒలకపోయటం, లో బ్యాటరీ ఛార్జింగ్‌, ఎక్స్‌రే, బుడగలు, గుర్తింపు కార్డు.. ఇలా వివిధ భావోద్వేగాలకు సరిపోయే ఎమోజీలు కనువిందు చేయనున్నాయి. ఇవి సరికొత్త చర్మం రంగులోనూ దర్శనమివ్వనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు ఇవీ ఆయా పరికరాల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఎమోజీల వాడకాన్ని ప్రోత్సహించటంలో వాట్సప్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందువల్ల ఇవి మున్ముందుగా వాట్సప్‌లోనే కనిపించొచ్చని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న