చంద్రుడి చుట్టూ 9,000 ప్రదక్షిణలు
close

Published : 08/09/2021 01:09 IST
చంద్రుడి చుట్టూ 9,000 ప్రదక్షిణలు

స్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ రెండేళ్లు పూర్తి చేసుకుంది. విక్రమ్‌ లాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి మీద కుప్ప కూలినప్పటికీ ఆర్బిటర్‌ దిగ్విజయంగా పనిచేస్తోంది. ఇది 9,000 సార్లు చంద్రుడిని చుట్టి వచ్చింది. చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 100 కి.మీ. ఎత్తులో తిరిగే ఆర్బిటర్‌లో 8 పరిశోధన పరికరాలు (పేలోడ్లు) ఉన్నాయి. అత్యంత విలువైన సమచారాన్ని సేకరించటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. టెర్రెయిన్‌ మ్యాపింగ్‌ కెమెరా-2, ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌, ఆర్బిటర్‌ హైరెజల్యూషన్‌ కెమెరాలు చంద్రుడి అద్భుత దృశ్యాలను అందించాయి. చంద్రుడి ఉపరితలం మీద హైడ్రాక్సీల్‌, నీటి అణువులు ఉన్నట్టు స్పష్టంగా గుర్తించటం గొప్ప విషయం. అలాగే సూర్య కిరీటం (కరోనా)  నుంచి అతి సూక్ష్మమైన జ్వాలలు (నానోఫ్లేర్స్‌) వెలువడుతున్నట్టూ పసిగట్టాయి. సూర్యుడి ఉపతలం కన్నా వెలుపలి భాగం ఎందుకు వేడిగా ఉంటుందనేది అర్థం చేసుకోవటానికి నానోఫ్లేర్స్‌ సమాచారం తోడ్పడనుంది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ సేకరించిన 1.25 టీబీ సమాచారాన్ని శాస్త్రీయ పరిశోధనలకు వాడుకోవటానికి అందరికీ అందుబాటులో ఉంచటం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న