సౌర వ్యవస్థ ‘శిలాజ’ అన్వేషణలో..
close

Updated : 20/10/2021 06:16 IST

సౌర వ్యవస్థ ‘శిలాజ’ అన్వేషణలో..

సుదూర గ్రహశకలాల అన్వేషణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తొలిసారిగా ఓ వ్యోమనౌకను ప్రయోగించింది. సౌర వ్యవస్థ ‘శిలాజాల’ గుట్టు పసిగట్టటం దీని ఉద్దేశం. ఆఫ్రికాలో లభించిన లూసీ అనే మానవ శిలాజం మనం ఎక్కడ్నుంచి వచ్చామనే దానిపై ఎంతో సమాచారాన్ని అందించింది. అందుకే ఈ ఉపగ్రహానికీ అదే పేరు పెట్టారు. ఇది గురుగ్రహం సమీపంలోని ఏడు ట్రోజన్‌ గ్రహశకలాలతో (సౌరవ్యవస్థ ఏర్పడిన తొలిరోజుల్లో మిగిలిపోయిన ముక్కలు) పాటు బోలెడన్ని గ్రహ శకలాలను పరిశీలించనుంది. ట్రోజన్‌ గ్రహ శకలాలను సౌర వ్యవస్థ శిలాజాలుగా భావిస్తారు. ఎందుకంటే వీటిల్లో సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలు దాగున్నాయి మరి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న